కన్నడ హీరో చిరంజీవి మృతి..

381
Chiranjeevi Sarja
- Advertisement -

కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. యంగ్ హీరో చిరంజీవి సర్జ ఆకస్మిక మరణం అందరినీ షాక్‌కు గురిచేసింది. చిరంజీవి సర్జ గుండెనొప్పితో మృతి చెందారు. ఆయన వయసు 39 సంవత్సరాలు. చిరంజీవి జూన్ 6న శ్వాస సమస్య బాధ పడటంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఊపిరి ఆడకుండా ఉండటంతో పాటు తీవ్రమైన ఛాతీ నొప్పి కూడా వచ్చింది. అయితే చిరంజీవి వయసు చాలా తక్కువ కావడంతో ఇది హృదయ సంబంధ వ్యాధి అని కుటుంబం అనుకోలేదు. కానీ దాంతో అతను ఇప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

చిరంజీవి ఆకస్మిక మరణంతో ఆయన అభిమానులు షాక్‌కు గురయ్యారు. సోషల్ మీడియా ద్వారా తమ అభిమాన నటుడికి కన్నీటి నివాళి అర్పిస్తున్నారు. కన్నడలోని మంచి యూత్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో చిరంజీవి ఒకరు. ఆయన చాలా ఫిట్‌గా ఉంటారు. అలాంటి వ్యక్తి గుండెపోటుతో మృతిచెందారంటే చాలా మంది నమ్మలేకపోతున్నారు. కాగా యాక్షన్ కింగ్ అర్జున్‌కు ఈయన మేనల్లుడు అవుతాడు.

చిరంజీవి ఇప్పటి వరకు 22 కన్నడ సినిమాల్లో నటించారు. 2009లోని ‘వాయుపుత్ర’ సినిమాతో చిరంజీవి తన కెరీర్‌ను మొదలుపెట్టారు. చిరంజీవి ఆఖరి సినిమా ‘శివార్జున’.లాక్‌డౌన్ అమల్లోకి రావడానికి కొన్ని రోజుల ముందే ఈ సినిమా విడుదలైంది. చిరంజీవి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

- Advertisement -