బీజేపీకి గట్టి దెబ్బ.. కన్నా రాజీనామా !

29
- Advertisement -

ఏపీలో బలపడాలని చూస్తున్న బీజేపీ పరిస్థితి అగమ్యంగోచరంగా మారింది. పవన్ అండతో ఏపీలో స్థిరపడాలని భావించిన కాషాయ పార్టీకి.. పవన్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో అర్థంకాక తలపట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే జనసేన ప్రస్తుతం బీజేపీ మిత్రపక్షంగా ఉన్నప్పటికి.. ఎన్నికల సమయానికి బీజేపీతో కటిఫ్ చెప్పి టీడీపీతో పొత్తుకు సై అన్నా ఆశ్చర్యం లేదు. దాంతో పవన్ పై ఆధారపడకుండా సొంత బలంతోనే ముందుకు సాగాలని భావించిన కాషాయ పార్టీకి సొంత నేతలే తలనొప్పిగా మారుతున్నారు. పార్టీలోని అంతర్గత విభేదాల కారణంగా పలువురు బీజేపీ నేతలు పార్టీ వీడే ఆలోచనలో ఉన్నారట. .

ఇప్పటికే సీనియర్ నేత కన్నా లక్ష్మినారాయణ పార్టీ మారతారని ఎన్నో రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కన్నా పార్టీ మారితే మరికొంతమంది ఏపీ కమలనాథులు కూడా అదే దారిలో వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. గత కొన్ని రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు కన్నా లక్ష్మినారాయణ. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీ వీడి టీడీపీ కండువా కప్పుకొనున్నారని ఆ మద్య వార్తలు వచ్చాయి. కాదు కాదు కన్నా చూపు జనసేన వైపు ఉందనే వాదన కూడా మరోవైపు నుంచి వినిపిస్తోంది. తాజాగా ( ఈరోజు ) ఆయన తన ముఖ్య అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశం అనంతరం ఆయన బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. ఇక ఆయనతో పాటు మరికొంత మంది కమలనాథులు కూడా బీజేపీ కి గుడ్ బై చెప్పారు. ఇక ఈ నెల 23 లేదా 24 తేదీల్లో కన్నా లక్ష్మినారాయణ ఏ పార్టీలో చేరతారు అనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కమలం పార్టీలో సీనియర్ నేతగా ఉన్న కన్నా లక్ష్మినారాయణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పడం గట్టి దేబ్బే అని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఏపీలో బలమైన బీజేపీ నేతల కొరత మెండుగా ఉంది. ఈ నేపథ్యంలో ఉన్న బలమైన నేతలు కూడా పార్టీ వీడడం వల్ల.. ఏపీలో బీజేపీ ఉనికే ప్రశ్నార్థకంగా మారే అవకాశం లేకపోలేదు. మొత్తానికి ఏపీలో బీజేపీకి తగులుతున్న షాకులు ఆ పార్టీ ని మరింత కలవర పెడుతున్నాయి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -