Retro:సూర్య ‘రెట్రో’ సాంగ్‌

3
- Advertisement -

కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రెట్రో. యాక్ష‌న్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతుండ‌గా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. స‌మ్మ‌ర్ కానుక‌గా మే 01న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

మ‌ల‌యాళ న‌టుడు జోజు జార్జ్, క‌రుణక‌ర‌ణ్, జ‌యరామ్ త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ సంద‌ర్భంగా మూవీ నుంచి ఫ‌స్ట్ సింగిల్‌ను విడుద‌ల చేశారు మేకర్స్.

సంతోష్ నారాయణన్ పాడిన ఈ సాంగ్‌లో అదిరిపోయే స్టెప్పులతో అలరించారు. గ్యాంగ్‌స్ట‌ర్‌గా మారిన ప్రేమికుడిని అత‌డి ప్రేయాసి ఎలా బ‌య‌టికి తీసుకువ‌చ్చింది. త‌న ప్రేయాసి కోసం క‌థానాయ‌కుడు ఏం చేశాడు అనేది సినిమా స్టోరీ.

- Advertisement -