Kanguva:సూర్య కంగువా ట్రైలర్

4
- Advertisement -

సూర్య కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం కంగువా. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ చిత్రం దాదాపు రూ.350 కోట్లతో తెరకెక్కుతుండగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సూర్యకు జోడిగా దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తుండగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ అందరిని ఆకట్టుకోగా తాజాగా ఈ చిత్రాన్ని కూడా ఫ్రాంచైజ్ రూపంలో రూపొందించే ప్లానింగ్ లో ఉన్నారట. సినిమాకి పార్ట్ 1 కి సీక్వెల్స్ పార్ట్ 2 సహా 3 ల కథలను సిద్ధం చేస్తున్నారట.

తాజాగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఓ తెగకు సంబంధించిన నాయకుడిగా బాబీ డియోల్ మిగతా తెగలను శాసించాలనే ఉద్ధేశ్యంతో వారిపై దాడి చేస్తుంటాడు. బాబీ డియోల్ లుక్‌ను పవర్‌ఫుల్‌గా చూపించగా హీరో సూర్య కూడా ఓ తెగకు చెందిన నాయకుడిగా, తన తెగను కాపాడుకునేందుకు చేసే యుద్ధాన్ని ట్రైలర్‌లో చూపించారు. ట్రైలర్ ఆధ్యంతం ఆసక్తికరంగా ఉండగా అక్టోబర్ 10న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

Also Read:NBK 109..కీ అప్‌డేట్

- Advertisement -