ఆ హీరోయిన్‌తో ప్రభాస్‌కు గొడవెంటి…?

192
Kangana's Differences With Prabhas
- Advertisement -

యంగ్‌హీరో ప్రభాస్‌కు ఇప్పుడు యూత్‌లో ఉన్న క్రేజే వేరు… రెబల్‌స్టార్‌ కృష్ణం రాజు నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు ఈ హీరో. మొదటి సినిమా ‘ఈశ్వర్’ లో పక్కా మాస్ హీరోగా ఇంట్రడక్షన్ ఇచ్చిన ప్రభాస్ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా పేరు తీసుకు రాలేదు.  ఇక ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఛత్రపతి’ సూపర్ డూపర్ హిట్ తర్వాత ప్రభాస్ కి మంచి కాలం కలిసి వచ్చింది.

ఆ చిత్రం తర్వాత వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్, మిర్చి తో హ్యాట్రిక్ కొట్టిన ప్రభాస్ ‘బాహుబలి’ తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో అయ్యాడు.  ఇప్పుడు ప్రభాస్ అంటే తెలుగు లోనే కాకుండా తమిళ, హిందీ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది.

Kangana's Differences With Prabhas

అయితే ప్రభాస్ తో ఓ హీరోయిన్ గొడ పెట్టుకుందట..అయితే అది ఇప్పుడు మాత్రం కాదు.  గతంలో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఏక్ నిరంజన్’ చిత్రంలో హీరోయిన్ గా నటించిన కంగనా రౌనత్. ఏక్ నిరంజన్ సినిమా షూటింగ్ సమయంలో కంగనా రౌనత్ ప్రభాస్‌కు చిన్న అభిప్రాయభేదాలు వచ్చాయట .  ఆ తర్వాత ఎలాగో అలా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ఇద్దరు తర్వాత ఎప్పుడూ కలుసుకున్నదే లేదట.

ఇక ఏక్ నిరంజన్ సినిమా టైమ్ లో ఇద్దరికీ పెద్ద పేరు లేదు..కానీ ఇప్పుడు ఈ ఇద్దరు టాప్ హీరో, హీరోయిన్లు.  ఓ సందర్భంలో కంగనా హీరో ప్రభాస్ గురించి మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పింది. కానీ ఇప్పుడు ప్రభాస్‌తో గొడవ పెట్టుకున్న విషయం మాత్రం సీక్రెట్ గానే ఉంచింది ఈ బాలీవుడ్‌ బ్యూటీ.

- Advertisement -