కంగనా..వచ్చే ఎన్నికల్లో పోటీ!

50
- Advertisement -

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కంగనా పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తరపున కంగనా బరిలోకి దిగడం దాదాపు ఖాయం కాగా ఏ లోక్ సభ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారన్నది తెలియాల్సి ఉంది.

ముంబైలోని తన ఫ్లాట్‌ను శివసేన సర్కార్ కూల్చివేయడంతో పాలిటిక్స్‌పై తనదైన శైలీలో కామెంట్స్ చేస్తూ వచ్చారు కంగనా. శివసేన వైఖరిని పలుమార్లు ఎండగట్టింది. ఇక ఇటీవల బీజేపీ చీఫ్ నడ్డాతో భేటీ అయ్యారు కంగనా. ఈ సమావేశంలోనే ఆమె ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది.

ఇక బీజేపీకి మొదటి నుండి గట్టి మద్దతుదారుగా ఉన్నారు కంగనా. అందుకే పలుమార్లు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఇక జయలలిత, ఇందిరా గాంధీలపై సినిమాలు కూడా చేశారు.

Also Read:ఈ ఆసనాలు వేస్తే.. మతిమరుపు దూరం!

- Advertisement -