ఐసీయూలో కంగనా.. !

253
Kangana sustained an injury
Kangana sustained an injury
- Advertisement -

గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి” వంటి వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న క్రిష్… ‘ఝాన్సీ లక్ష్మీబాయి’ జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.. షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు హీరోయిన్ కంగనా రనౌత్ కు తీవ్ర గాయాలయ్యాయి. సినిమా షూటింగ్ లో భాగంగా నటుడు నిహార్ పాండ్యాతో కంగన కత్తి యుద్ధం చేయాల్సి వుంది. పలు మార్లు ప్రాక్టీస్ చేసిన అనంతరం, నిజమైన కత్తులతో వీరిద్దరూ యుద్ధానికి సిద్ధపడగా, తల కిందకు వంచాల్సిన సమయంలో కంగన రియాక్షన్ సరిగ్గా లేకపోవడంతో, నిహార్ దూసిన కత్తి, ఆమె నుదుటిని చీల్చిండంతో రెండు కనుబొమ్మల మధ్య నుంచి ముక్కు మీదుగా తీవ్ర గాయం అయింది. ఆ వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, 15 కుట్లు వేసిన వైద్యులు, ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్సను అందిస్తున్నారు.

kangana-ranaut-injured

కత్తి గాయం పుర్రె ఎముకకు అతి దగ్గరగా వెళ్లిందని, ఇంకొన్ని మిల్లీమీటర్లు లోపలికి దిగితే, ఆమె ప్రాణాలు మిగిలుండేవి కావని వైద్యులు అన్నారట. ఆమె ప్రాణాలకు ప్రమాదం లేనప్పటికీ, కోలుకుని డిశ్చార్జ్ కావడానికి కొన్ని వారాల సమయం పడుతుందని వైద్య వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ ఘటన తరువాత నిహార్ ఆమెకు క్షమాపణలు చెప్పగా, కంగన క్షమించేసిందని నిర్మాత కమల్ జైన్ తెలిపారు.

విజయేంద్రప్రసాద్ కథ-స్క్రీన్ ప్లే సమకూర్చుతున్న ఈ చిత్రానికి శంకర్-ఎహసాన్-లాయ్ త్రయం సంగీతం అందిస్తున్నారు. హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఏకకాలంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది.. ఏప్రిల్ 27, 2018 విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

- Advertisement -