Kangana : ముక్కలు చేయడమే కాంగ్రెస్ విధానం, రాహుల్‌పై కంగనా ఫైర్

5
- Advertisement -

దేశాన్ని ముక్కలు చేయడమే కాంగ్రెస్ విధానం అని మండిపడ్డారు ఎంపీ, సినీ నటి కంగనా రకౌత్. తనపై దాడులకు ఈడీ సిద్ధమవుతున్నదని, లోక్‌సభలో తాను చేసిన చక్రవ్యూహం ప్రసంగం కొందరికి నచ్చలేదని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో స్పందించారు కంగనా.

రాహుల్ వ్యాఖ్యలు అర్థరహితమని, రాహుల్‌ గురించి ఏం చెప్పగలం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అర్ధం పర్ధం లేని మాటలపై ఏం మాట్లాడతం..నాకైతే ఆయన ఏమన్నారో అర్దం కాలేదని చెప్పుకొచ్చారు. దేశం గురించి రాహుల్ మాట్లాడిన మాటలు సరైనవి కాదని … కాంగ్రెస్‌ నేతలు తాము లాభపడేందుకు దేశాన్ని ముక్కలుగా విభజిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ హయాం నుంచే ఇలా జరుగుతుందని ఆరోపించారు.

మరోవైపు కేంద్ర ప్రభుత్రం విపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను ఉసిగొల్పి దాడులు చేయిస్తోందని, ఈ బెదిరింపులకు రాహుల్ గాంధీ భయపడరని కాంగ్రెస్‌ నేత మాణికం ఠాగూర్‌ స్పష్టం చేశారు. మోదీ సారధ్యంలోని ప్రస్తుత ప్రభుత్వం బలహీనమైనదని, మోదీ బలహీన ప్రధాని అన్నది అందరికీ తెలిసిందేనని తెలిపారు.

Also Read:Rahul:ఈడీతో దాడికి ప్లాన్..ఛాయ్‌- బిస్కెట్‌తో రెడీ

- Advertisement -