- Advertisement -
కంగనా రనౌత్ రెస్టారెంట్ “ది మౌంటెన్ స్టోరీ” వాలెంటైన్స్ డే నాడు మనాలీలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రఖ్యాత హిమాచలి వంటకాలను ఈ రెస్టారెంట్‌లో అందిస్తున్నారు.
అయితే ఇటీవల వర్షాలు హిమాచల్ ప్రదేశ్‌ను ముంచెత్తాయి. దీంతో హిమాచల్ ప్రదేశ్‌కు పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ది మౌంటెన్ స్టోరీ రెస్టారెంట్’ నిర్వహణ భారంగా మారిందని స్వయంగా కంగనానే వెల్లడించారు.
నా హోటల్‌కు నిన్న రూ.50 వచ్చాయి, కానీ జీతాలు మాత్రం రూ.15 లక్షలు ఇవ్వాలి అని కంగనా ఆవేదన వ్యక్తం చేశారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మండి జిల్లాలో కంగనా రనౌత్ పర్యటన సందర్భంగా ఈ కామెంట్స్ చేశారు. తన బాధను అర్థం చేసుకోండని వరద బాధితులను కోరారు కంగనా.
Also Read:భారతీయులకు ట్రంప్ మరో షాక్!
- Advertisement -

