పెళ్లికి నేనూ రెడీ: కంగనా

44
- Advertisement -

పెళ్లి గురించి బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ…పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ…టైమ్‌ వస్తే అదే జరుగుతుందని అన్నారు. ప్రతిదానికి ఓ సమయం ఉంటుంది. నా జీవితంలో అలాంటి సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటా అని తెలిపారు. అంతే కాదు పెళ్లి చేసుకొని నా కంటూ ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆశగా ఉందని సరైన టైమ్‌లోనే నాకు పెళ్లి అవుతుందని నమ్ముతున్నా అని చెప్పారు.

గతంలో కూడా పెళ్లి ప్రస్తావన గురించి మాట్లాడుతూ తన జీవితంలో ఒక ప్రత్యేక వ్యక్తి ఉన్నారని సమయం వచ్చినప్పుడు తప్పకుండా అందరికీ పరిచయం చేస్తానని ఆమె చెప్పినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా టీకూ వెడ్స్ షేరు ప్రమోషన్స్‌లో భాగంగా ఆమెను పెళ్లి గురించి ప్రశ్నించగా…చేసుకుంటానంటూ బదులిచ్చారు.

Also Read: ఆ హీరోతో ప్రేమలో సమంత ?

ప్రస్తుతం కంగనా ఎమర్జెన్సీ సినిమాలో నటిస్తున్నారు. దీనితో పాటుగా నవాజుద్దీన్ సిద్ధిఖీ, అవనీత్‌ కౌర్ కీలక పాత్రలో నటించిన టీకూ వెడ్స్‌ షేరుకు కంగనా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Also Read: జిలేబి టీజర్‌ విడుదల

- Advertisement -