ఎమర్జెన్సీ..అన్ని తాకట్టుపెట్టా: కంగనా

22
- Advertisement -

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచారు. 1977 నాటి ఎమర్జెన్సీని బేస్ చేసుకుని సినిమా తెరకెక్కుతుండగా సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కంగనా.

ఈ సినిమాకు దర్శకత్వం, నిర్మాణం కంగనానే కాగా అభిమానులతో కలిసి సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ రోజు ఎమర్జెన్సీ షూట్‌ పూర్తి చేశాను… నా జీవితంలో అద్భుత ఘట్టం చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా కోసం నేను ఏ కష్టం పడలేదని అందరూ అనుకుంటున్నారు… కానీ వాస్తవం వేరు. నాకు సంబంధించిన ఆస్తులన్నీ తాకట్టు పెట్టాను అని తెలిపింది.

ఆరోగ్యం పరంగానూ చాలా ఇబ్బంది పడ్డాను… డెంగ్యూ బారిన పడి రక్త కణాల సంఖ్య భారీగా పడిపోయింది. అయినా తట్టుకుని నిలబడ్డాను. ఇది నాకు పునర్జన్మ అంటూ ఎమోషనల్‌ నోట్‌ పోస్ట్‌ చేసింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -