ప్చ్.. ఆ బ్యూటీ మళ్లీ ఫైరయ్యింది.

61
- Advertisement -

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఏం మాట్లాడినా బోల్డ్ గానే మాట్లాడుతుంది. అలాంటి ఈ బ్యూటీ ప్రస్తుతం ‘చంద్రముఖి 2’తో థియేటర్స్ లో హడావిడి చేస్తోంది. దెయ్యంగా అలరించడానికి కంగనా తెగ కష్టపడిందట. కానీ ఆమె మాత్రం చంద్రముఖి 2కి ప్లస్ కాలేదు అని అంటున్నారు. ఐతే, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ ఉత్తరాది భామ దక్షిణాది చిత్రాల్లోని కథల పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. దక్షిణాది చిత్రాల్లో కథలు బాగుంటాయి. ఇక్కడి దర్శకుల్లో మంచి కథ చెప్పాలనే తపన ఉంటుంది. అందుకే, వాళ్ళు హీరోయిన్ల పాత్రలను కూడా చాలా బాగా డిజైన్ చేస్తారు. చంద్రముఖి 2 లో కూడా నా పాత్ర చాలా బలంగా ఉంటుంది’ అని కంగనా చెప్పింది.

ఇక్కడితోటి ఆపితే ఆమె కంగనా రనౌత్ ఎందుకు అవుతుంది ?, పనిలో పనిగా తనదైన శైలిలో కంగనా రనౌత్ నార్త్ ఇండస్ట్రీ పై కూడా తనదైన పంచ్ లను వదిలింది. నార్త్ సినిమాలు పురుషాధిక్యాన్ని సెలబ్రేట్ చేసుకునే విధంగా ఉంటాయి, నాకు ఇప్పటికీ అర్ధం కాదు. నార్త్ సినిమాలు మొత్తం ఒక్క హీరోయిజమ్ అనే ఐటమ్ చుట్టే తిరుగుతాయి. దీనికితోడు ప్రతి సినిమాలోనూ బూతు ఉంటుంది. పైగా హీరోయిన్లకు అసలు ప్రాధాన్యత ఉండదని కంగనా చెప్పింది. అందుకే, అలాంటి చెత్త సినిమాల్లో భాగం కాకూడదనే తాను కొన్ని భారీ ఆఫర్లను కూడా వదులుకున్నట్లు కంగనా రనౌత్ తెలిపింది.

ఏమిటో కంగనా రనౌత్. మంచో చెడో.. నార్త్ సినీ ఇండస్ట్రీలోనే బాగా డబ్బు సంపాదించుకుని, ఇప్పుడు సౌత్ కి వచ్చి.. నార్త్ ఇండస్ట్రీపైన నెగిటివ్ కామెంట్ లు చేయడం పరిపాటిగా మారింది. ఈ లిస్టులో కంగనా రనౌత్ తో పాటు ఆ మధ్య విద్యా బాలన్ కూడా చేరింది అనుకోండి. అన్నట్టు కంగనా రీసెంట్ గా ఓ వింత గెటప్‌లో కనిపించింది. కళ్లు, చెంపలు లోపలికి పోయి ఉన్న ఆమెను చూసిన నెటిజన్లు ట్రోల్స్ చేశారు. వీటికి కూడా కంగనా రిప్లై ఇస్తూ.. ‘మీలాంటి వారి కోసమే ఇలా కనిపించా. మీరూ ఇలాగే మెసేజ్ లు చేస్తూ కూర్చోండి’ అని ఫైరయ్యింది.

Also Read:నేటి రెండు చిత్రాల పరిస్థితేంటి?

- Advertisement -