ఏయ్ కంగనా… పిచ్చి పిచ్చి కూతలొద్దు

37
- Advertisement -

కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా కొత్త ముచ్చట్లు అక్కర్లేదు. అమ్మడు నిత్యం వివాదాలతో బ్రేక్ ఫాస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో కొందరు ఆమె పై అవాకులు చెవాకులు పేలుతూ ఉంటారు. కాకపోతే, కొన్ని సార్లు కంగనా తనకే తెలియకుండా అలవాటులో పొరపాటుగా కామెంట్స్ చేస్తూ ఉంటుంది. ఒక్కో సారి అంతే.. మనకు తెలియకుండానే మన మాటల వల్ల.. కొంత మంది హర్ట్‌ అవుతుంటారు అని సరిపెట్టుకోలేం కదా. ముఖ్యంగా కంగనా రనౌత్ లాంటి సెలబ్రిటీలు వల్ల అయితే.. ఆ కొంత మందే నెట్టింటకెక్కి గోల చేయడం స్టార్ట్ చేస్తారు.

ఆ సెలబ్రిటీల ఇంటెన్షన్ అది కాదని తెలిసినా.. పట్టించుకోరు. ఏదో కాంట్రవర్సీ చేస్తారు. పైగా ‘కంగనా రనౌత్’ లాంటి వారి పై అయితే రెచ్చిపోతూ ఉంటారు. ఆ సెలబ్రిటీ పై ట్రోల్స్‌తో… సోషల్ మీడియాను ఊపేస్తారు. తాజాగా కంగనా రనౌత్ ను కూడా అదే చేశారు కొంత మంది నెటిజన్లు. ఓ పక్క పాన్ ఇండియా స్టార్‌ గా.. నేషనల్ బ్యూటీగా వెలిగిపోవడమే కాదు.. బాలీవుడ్ సినీ ప్రజలకు ఎప్పుడూ టార్కెట్‌ అయ్యే లేడీగా.. కంగనా రనౌత్ గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి కంగనా రనౌత్ తాజాగా మరో సారి చిక్కుల్లో పడ్డారు.

రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన కంగనా రనౌత్.. మాటల్లో మాటగా.. తనకు రాజకీయాల్లోకి రావాలని ఉందని.. జయలలిత బయోగ్రఫీలో యాక్ట్ చేసిన దగ్గర నుంచి తనకు మరో జయలలితలా మారిపోవాలి అనిపిస్తోంది అని కంగనా రనౌత్ చెప్పుకొచ్చింది. పైగా తాను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వక ముందు తన తండ్రి జయలలిత గురించే చెప్పేవారని.. తనకు జయలలిత జర్నీ చాలా ఇష్టం అంటూ కంగనా రనౌత్ చెప్పుకొచ్చింది. దీంతో జయలలిత లాంటి గొప్ప వ్యక్తితో నీకు పోలిక ఏమిటి ?, పిచ్చి పిచ్చి కూతలు కూయకు అంటూ కంగనా పై నెటిజన్లు రెచ్చిపోతున్నారు.

Also Read:ఆకట్టుకుంటున్న ‘లక్కీ భాస్కర్’ ఫస్ట్ లుక్‌

- Advertisement -