Kangana:స్టార్లకు ఆ దమ్ము లేదు

15
- Advertisement -

కంగనా రనౌత్ ఓపెన్ గా మాట్లాడుతుంది. పైగా చాలా బోల్డ్ విషయాల్ని చాలా ఓపెన్ గా మాట్లాడుతుంది కంగనా రనౌత్. ఇక తన వ్యక్తిగత విషయాలు, ఆరోగ్య సమస్యలతో పాటు కెరీర్ పై పలుమార్లు ఓపెన్ గా మాట్లాడింది. ఇప్పుడు మరో బోల్డ్ స్టేట్ మెంట్ తో ముందుకొచ్చింది. కంగనా రనౌత్ అభిప్రాయం ప్రకారం.. చాలామంది హీరోలకు కొత్తగా ప్రయత్నించే దమ్ము లేదు అట. “చాలామంది యాక్టర్లకు ఏదో కొత్తగా చేయాలని ఉంది. కానీ వాళ్లు అలా చేయలేరు. ఎందుకంటే వాళ్లకు అంత దమ్ము ఉండదు లేదా అలాంటి అవకాశం వచ్చి ఉండదు’ అంటూ మొత్తానికి కంగనా రనౌత్ చెప్పుకొచ్చింది.

పనిలో పనిగా తన మాజీ ప్రియుడు హృతిక్ రోషన్ గురించి కూడా కంగనా రనౌత్ ఓ కామెంట్ చేసింది. అతగాడిలో మంచి నటుడు ఉన్నాడు, కానీ అతని ఇగో ఆ నటుడ్ని బయటకు రానివ్వదు అంటూ ఇన్ డైరెక్ట్ గా కంగనా రనౌత్, హృతిక్ పై కామెంట్స్ చేసింది. ఇక తన విషయానికి వస్తే.. ‘నా సినిమాలు చాలా డిఫరెంట్ అని చెబుతాను. మిగతా నటులతో, నటీమణులతో పోల్చి చూస్తే, కంగనా రనౌత్ కథల ఎంపిక చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆ ధైర్యం చాలామందికి లేదు’ అని కంగనా రనౌత్ తెలిపింది.

మొత్తానికి, ఇలా తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని బయటపెట్టింది కంగనా రనౌత్. తన సినీ కెరీర్ ను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఎక్కువ సినిమాలు చేయలేకపోవచ్చు. సినిమా ఇండస్ట్రీలో వాతావరం పాజిటివ్ గా ఉండి ఉంటే.. ప్రేక్షకులు కూడా జన్యున్ గా ఉండి ఉంటే.. నా సినీ కెరీర్ మరో రకంగా ఉండేదని కంగనా అభిప్రాయపడింది. మొత్తమ్మీద తాను చాలా ధైర్యవంతురాలని అంటోంది కంగనా.

Also Read:8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

- Advertisement -