‘అలియా’ పై మళ్లీ కంగనా కూతలు

26
- Advertisement -

కంగనా రనౌత్ అంటేనే వివాదాల మనిషి. పైగా స్టార్లను కూడా ట్రోల్ చేస్తూ కుళ్ళు జోకులు వేస్తూ ఉంటుంది. మరి అన్ని విషయాల్లో కామెడీ పనికి రాదు కదా. మరీ ముఖ్యంగా సున్నితమైన విషయాల్లో అస్సలు జోకులు వేయకూడదు అని కంగనా రనౌత్ కి అస్సలు తెలియదు. ఈ విషయం తెలిసి కూడా కంగనా రనౌత్ తన పెళ్లిపై గతంలో జోకులేసింది. ఇప్పుడు వాటికి ఫలితం అనుభవిస్తోంది. తను వేసిన జోకులే తనకు రివర్స్ లో తలుగుతుంటే, సోషల్ మీడియాలో కంగనా రనౌత్ సైలెంట్ అయింది.

ఇంతకీ, మేటర్ ఏంటంటే.. గతంలో చాలామందితో డేటింగ్ చేస్తోంది కంగనా రనౌత్. హీరో హృతిక్ రోషన్ తో లవ్ లో ఉన్న విషయాన్ని కూడా ఆమె అప్పట్లోనే బయటపెట్టింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. దాన్ని కూడా కంగనా రనౌత్ రచ్చ చేసింది. ఐతే, ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ పెళ్లి పై కూడా కామెంట్స్ చేసింది. తాను పెళ్లి కూడా చేసుకుంటాను అని చెప్పుకొచ్చింది. అప్పటి నుంచి పెళ్లి ఎప్పుడనే ప్రశ్న కంగనా రనౌత్ కి కామన్ అయిపోయింది.

తాజాగా, కంగనా రనౌత్ కి ఈ ప్రశ్న మళ్లీ ఎదురైంది. దీనికి ఆమె వ్యంగ్యంగా స్పందిస్తూ.. తానింకా గర్భవతిని కాలేదని, గర్భం దాల్చినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటానంటూ కంగనా రనౌత్ మళ్లీ అలియా భట్, ఇలియానా లాంటి హీరోయిన్స్ పై సెటైర్స్ వేసింది. గతంలో కూడా కంగనా రనౌత్ ఇలాంటి కామెంట్సే చేసింది. అలియా భట్ తన గర్భం గురించి బయటపెట్టిన వెంటనే.. ఆమె గర్భం పై కంగనా రనౌత్ అనవసరంగా బ్యాడ్ చేసింది. మళ్లీ తాజాగా అలాంటి కూతలే కూసింది.

Also Read;ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి…క్లీన్ యు

- Advertisement -