కాంచన 4..కీ అప్‌డేట్!

10
- Advertisement -

కాంచన కోలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన హారర్ ఫ్రాంచైజ్‌గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో కూడాఈ సినిమా సీక్వెల్స్‌కు మంచి రెస్పాన్స్ దక్కింది. ముఖ్యంగా కాంచన 3 బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.100 కోట్లు వసూలు చేసి, తెలుగులో నాని నటించిన జెర్సీ సినిమాకు గట్టి పోటీ ఇచ్చింది.

ఇప్పుడు నాలుగో భాగం నిర్మాణంలో ఉంది. తాజా సమాచారం ప్రకారం, షూటింగ్ ఇప్పటికే సగం పూర్తయింది. రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కాలేదు. త్వరగా షూటింగ్ పూర్తిచేయడంపై మేకర్స్ దృష్టి సారించారు.

రాఘవ లారెన్స్ దర్శకుడిగా, నిర్మాతగానూ కాంచన 4 ను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ ఈ హారర్ సినిమాలో నటించనుంది. ఈ సినిమా ఆమెకు కోలీవుడ్ డెబ్యూ కూడా అవుతుంది. పూజా హెగ్డే మరియు రష్మిక మందన్నా కూడా నటీనటుల జాబితాలో ఉన్నారని సమాచారం. అయితే, వారి పాత్రలపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

Also Read:ఉప ఎన్నికలు రావడం ఖాయం:జగదీష్ రెడ్డి

- Advertisement -