నాగశౌర్య, సాయిపల్లవి జంటగా ఎన్.వి.ఆర్. సినిమా సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ పతాకంపై విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కణం’. ఇటీవలె సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కట్స్ ఏమీ లేకుండా U/A సర్టిఫికేట్ పొందింది. ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఈ చిత్రం విడుదల పలుమార్లు వాయిదా పడింది.
అయితే, ఈసినిమా విడుదలలో ఆలస్యాన్ని కవర్ చేయడానికి ఒక్కొక్క పాటను విడుదల చేస్తూ వస్తోంది కణం టీం. ఈ నేపథ్యంలో చిత్రం రెండో పాట ‘జో లాలి జో’ను ఇవాళ సాయంత్రం 8 గంటలకు విడుదల చేయనున్నారు. ఇప్పటికే సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్‌తో అంచనాలు పెరిగిపోగా ఆడియో కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ సినిమా తమిళ్‌లో కరు పేరుతో రానుంది. ఈ సినిమాలో సాయిపల్లవి నాలుగేళ్ల కూతురికి తల్లి పాత్రలో కనిపించబోతుండడం విశేషం.
ఈ చిత్రానికి నిరవ్‌షా, శ్యామ్ సి.ఎస్., ఎల్.జయశ్రీ, స్టంట్ సిల్వ, ఆంటోని, విజయ్, సత్య, పట్టణం రషీద్, ఎం.ఆర్.రాజకృష్ణన్, కె.మణివర్మ, రామసుబ్బు, సప్న షా, వినయదేవ్, మోడేపల్లి రమణ, కె.భార్గవి, ప్రత్యూష, ఎస్.ఎం.రాజ్‌కుమార్, ఎస్.శివశరవణన్, షియామ్ పనిచేస్తున్న సాంకేతికవర్గం. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.ప్రేమ్, సమర్పణ: ఎన్.వి.ఆర్. సినిమా, నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్, దర్శకత్వం: విజయ్.