‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ ట్రైలర్..

532
KammaRajyamlo Kadapareddlu
- Advertisement -

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం కమ్మరాజ్యంలో కడపరెడ్లు అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా ఈమూవీ ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ట్రైలర్ లో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లను టార్గెట్ చేస్తూ వర్మ తన కాంట్రవర్సీ మార్క్ చూపించారు.

‘బ్రేకింగ్ న్యూస్.. మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన బాబు పార్టీ.. చరిత్రలోనే ఎవరూ రుచి చూడనంత ఘోర పరాజయాన్ని చవి చూసిన తరువాత కొన్ని చాలా విపరీత పరిస్థితులు ఏర్పడుతున్నాయి’ అంటూ ఏపీ రాజకీయ పరిస్థితుల్ని హింసాత్మకంగా చూపించారు వర్మ. ఇక ఈ ట్రైలర్‌లో అలీ, బ్రహ్మానందం, యాంకర్ స్వప్న, కత్తి మహేష్‌లు కీలకపాత్రల్లో కనిపిస్తున్నారు.

ఏపీ సీఎం జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత విజయవాడ కేంద్రంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను ప్రధానంగా ఈ ట్రైలర్‌లో చూపించారు. ఏపీలో ఉన్న రాజకీయ నాయకులందరిని ఈసినిమాలో చూపించారు వర్మ. విడుదలకు ముందే కాంట్రవర్సీగా మారిన ఈసినిమా కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -