సంచలనంగా మారిన ‘బాబు చంపేస్తాడు’ సాంగ్..

554
BABU CHAMPESTHAADU Song
- Advertisement -

వివాదలకు కేరాఫ్‌ అంటే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అని ఎవరైనా చెప్పేస్తారు. అలాంటి డైరెక్టర్ ప్రస్తుతం వర్మ మరో వివాదానికి తెరలేపాడు. ఈ దర్శకుడు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే సినిమాకు సంబందించిన ప్రమోషన్ డోస్‌ను వర్మ క్యాస్ట్ ఫీలింగ్‌తో నడిపిస్తున్నాడు.

ఇటీవలే ఈ చిత్రం నుంచి గతంలో ఎప్పుడు లేని విధంగా కొత్త తరహాలో క్యాస్ట్ రచ్చకు దారి తీస్తున్న ఆర్జీవీ మొదటి సాంగ్‌ని కూడా రిలీజ్ చేశాడు.ఈ పాటను యూ ట్యూబ్‌లో ఇప్పటివరకు 12 లక్షల మంది వీక్షించారు. ఈ పాటను 37 వేల మంది లైక్ చేయగా 8.5 వేల మంది డిస్ లైక్ చేశారు.

తాజాగా ఈ సినిమా నుండి ‘బాబు చంపేస్తాడు’ అనే పాటను విడుదల చేశారు చిత్ర బృందం. ‘ఏయ్.. ఏసెయ్ రా నా కొడుకుని.. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అంటూ మొదలైన ఈ వీడియోలో వర్మ వ్యాఖ్యానం ఉంది. ఈ చిత్రం పూర్తిగా కల్పిత పాత్రలతో ఉన్న కల్పిత కథ అని వర్మ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఆ పాత్రలను నిజజీవిత పాత్రలతో పోల్చడం యాదృచ్చికం అని, సత్య హరిశ్చంద్రుడిపై ప్రమాణం చేసి చెబుతున్నానని వర్మ పేర్కొన్నారు.

- Advertisement -