రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలను స్పూర్తిగా తీసుకొని రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మూడు మొక్కలు నాటి మరో ముగ్గురిని ఈ ఛాలెంజ్‌కు నామినేట్ చేసి మొక్కలు నాటించాలి. ఈ గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మంగళవారం సిద్దిపేట పోలీస్ కమిషనర్ డి.జోయల్ ఐపీఎస్ తన కార్యాలయ ఆవరణలో మూడు మొక్కలు నాటి.. అనంతరం ట్విటర్ ద్వారా కామారెడ్డి జిల్లా ఎస్సీ ఎన్ శ్వేత ఐపీఎస్ కు మొక్కలు నాటవల్సిందిగా కోరారు.
ఈ సందర్భంగా నేడు ఎస్పీ శ్వేత ఐపీఎస్ పోలీసు వనంలో మూడు మొక్కలు నాటారు. అనంతరం మరో ముగ్గురుని ఈ ఛాలెంజ్‌కు నామినేట్ చేశారు. నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్తికేయ ఐపీఎస్,మెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తి ఐపీఎస్,ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవ రాజన్ ఐఏఎస్ లకు గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొనాలని ఆమె కోరారు.
ఈ సందర్భంగా ఎస్పీ శ్వేత మాట్లాడుతూ.. జీవకోటికి ప్రాణాధారం ఆక్సిజన్ అని, చెట్లు కనుమరుగవుతున్న కారణంగా కృత్రిమ ఆక్సిజన్ అవసరం ఉండే ప్రమాదం ఏర్పడుతుందని కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మునుముందు ఇంకా విస్తరించి ప్రజలకు, భావిభారత తరాలకు ఉపయోగపడే విధంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్‌స్పెక్టర్ పి.నరసిహారావు,సుభాష్,పనినహార్ రెడ్డి ఆర్‌ఎస్ లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.