Kamal:థగ్‌ లైఫ్..సర్‌ప్రైజ్

15
- Advertisement -

ఇండియన్ 2 తర్వాత కమల్ హాసన్ నటిస్తున్న చిత్రం థగ్ లైఫ్‌. కమల్ కెరీర్‌లో ఇది 234వ సినిమా కాగా మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ఢిల్లీలోని సంకట్‌ మోచన్‌ హనుమాన్‌ మందిర్‌లో జరుగుతుండగా తాజాగా సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రేపు ఉదయం 10 గంటలకు Sigma Thug Rule అప్‌డేట్ రానుందంటూ ఓ వీడియో షేర్ చేశారు మేకర్స్. ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ ఏఆర్‌ రెహమాన్ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నాడు. ఈ మూవీని కమల్ హాసన్‌-ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్‌, రెడ్ జియాంట్ మూవీస్‌, మద్రాస్ టాకీస్‌ బ్యానర్లపై కమల్‌ హాసన్‌-ఆర్ మహేంద్రన్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.

ఐశ్వర్యలక్ష్మి, త్రిష, ఫీ మేల్‌ లీడ్ రోల్స్‌ పోషిస్తుండగా.. గౌతమ్‌ కార్తీక్‌, జోజు జార్జ్‌, దుల్కర్ సల్మాన్‌, జయం రవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Also Read:డైరెక్టర్ సుకుమార్ @ 20

- Advertisement -