కలాం ఇంటినుండి కదిలిన కమల్‌ యాత్ర..

212
- Advertisement -

ప్రముఖ నటుడు కమల్‌హాసన్ రాజకీయ యాత్ర ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 8 గంటలకు కమల్‌ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం స్వస్థలం రామేశ్వరం చేరుకున్నారు. కలాం సోదరుడు మహమ్మద్‌ ముతుమీర లెబ్బాయ్‌కు చేతి గడియారం కానుకగా ఇచ్చారు. సాధారణ గృహాల్లో నివసించడంలోనే గొప్పతనం ఉందని.. కలాం వంటి గొప్ప వ్యక్తి పుట్టిన రామేశ్వరం నుంచి తన రాజకీయ యాత్ర ప్రారంభించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా కమల్‌ అన్నారు. ఉదయం 9 గంటలకు ఆయన మత్య్సకారులతో సమావేశమయ్యారు. 10 గంటలకు హయత్‌ ప్లే్‌స్‌ హోటల్‌లో నిర్వహించనున్న ప్రెస్‌మీట్‌లో పాల్గొంటారు.

Kamal Political Party Launch Today In Madurai

రామేశ్వరంలోని అబ్దుల్ కలాం నివాసం నుంచి కమల్‌హాసన్ రాజకీయ యాత్రను ప్రారంభించారు. యాత్రలో భాగంగా రామేశ్వరం, పరమకొడి, మదురైలో జరిగే బహిరంగ సభల్లో కమల్ పాల్గొని ప్రసంగించనున్నారు. మదురైలోని సభలో తన పార్టీ పేరు, పతాకం, సిద్ధాంతాలను అభిమానుల సమక్షంలో ప్రకటించనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు బహిరంగ సభ ప్రారంభం కానుంది.

Kamal Political Party Launch Today In Madurai

ఈ సభకు తరలి రావాలంటూ కమల్‌హాసన్‌ తన ట్విట్టర్‌ వేదికగా రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘రేపు ప్రారంభం కానుంది మన సుదీర్ఘ ప్రయాణం. సాయంత్రం 6 గంటలకు మదురై ఒత్తకడై మైదానంలో మహాసభలో మన పార్టీ పతాకం ఆవిష్కరిస్తాను. కొత్త పార్టీ పేరు, మన సిద్ధాంతాల సారాంశాన్ని వివరిస్తా. రండి, రండి.. కొత్త శకం సృష్టిద్దాం’’ అని మంగళవారం కమల్‌ ట్వీట్‌ చేశారు. పార్టీ ప్రారంభ వేడుకకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హాజరు కానున్నారు.

- Advertisement -