8 దేశాల్లో ‘ఇండియన్ 2’

291
kamal indian 2
- Advertisement -

క్రియేటివ్ దర్శకుడు శంకర్-కమల్ హాసన్ కాంబినేషన్‌లో ఇండియన్ 2 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలె సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ప్రతి సినిమాలోనూ ఫారిన్ లొకేషన్స్ ఎక్కువగా ఉండేలా చూసే శంకర్ ఈ సినిమాను కూడా ఇండియా కాకుండా మరో 8 దేశాల్లో షూట్ చేయనున్నాడట.

విదేశాల్లో తీసే సీన్స్‌ ఈ సినిమాకే హైలైట్‌గా నిలవనున్నాయట. భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కమల్‌ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది.ఇంకా ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ నటీనటులతో బాలీవుడ్ స్టార్లు కూడా నటించనున్నట్లు తెలుస్తోంది.

రెండు దశాబ్ధాల క్రితం వీరి కాంబినేషన్లో వచ్చిన ‘భారతీయుడు’ పెను సంచలనం సృష్టించింది. అవినీతి, అక్రమాలని అరికట్టడంలో ‘భారతీయుడు’ చూపించిన తెగువ అందరి మనసుల్లో బలంగా నాటుకుపోయింది. అవినీతి అరికట్టడంపై వివిధ భాషల్లో ఎన్నోసినిమాలు వచ్చాయి కానీ అవేవీ భారతీయుడు సినిమాలా ఆకట్టుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో శంకర్-కమల్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -