- Advertisement -
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికార అన్నాడీఎంకే,డీఎంకే మధ్య హోరాహోరి పోరు జరుగుతుండగా రజనీకాంత్ పార్టీ కూడా ఎన్నికల సమరంలో దిగనుండటం తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది.
రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు కమల్. అయితే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న విషయాన్ని మాత్రం తర్వాత ప్రకటించనున్నట్లు కమల్ వెల్లడించారు.
మక్కల్ నీధి మయం పార్టీని స్థాపించిన కమల్…ఇప్పటికే క్షేత్రస్ధాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
- Advertisement -