- Advertisement -
విక్రమ్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నారు కమల్ హాసన్. ఈ నేపథ్యంలో తన తర్వాతి ప్రాజెక్టులపై మరింత దృష్టిసారించారు. ఇందులో భాగంగా భారతీయుడు 2 సినిమా కోసం మేకోవర్ అయ్యేందుకు అమెరికా వెళ్లారు కమల్‌హాసన్. దాదాపు మూడు వారాల పాటు యూఎస్‌లోనే ఉండి తన ఫిజిక్‌ని మార్చుకోనున్నారట. ఇప్పుడు ఈ వార్త టీ టౌన్లో హాట్ టాపిక్‌గా మారింది.
కమల్-శంకర్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఇండియన్ . 2020లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించగా కరోనా, సెట్స్‌లో నెలకొన్న ప్రమాదం వంటి కారణాలతో ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడింది. కమల్‌హాసన్ అమెరికా నుంచి రాగానే సెప్టెంబరులో ఇండియన్ 2ని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది.
- Advertisement -