సనాతన ధర్మంపై కమల్‌హాసన్‌

77
- Advertisement -

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఉదయనిధిపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తుండగా సర్వోన్నత న్యాయస్ధానం సుప్రీం సైతం దీనిపై వివరణ ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వానికి, ఉదయనిధిని కోరింది.

ఇక తాజాగా ఉదయనిధి వ్యాఖ్యలపై లోకనాయకుడు కమల్ హాసన్ స్పందించారు. సనాతన ధర్మంపై గతంలోనూ చాలా మంది మాట్లాడారని, ఆ అంశంపై మాట్లాడినందుకు చిన్నపిల్లవాడైన ఉదయనిధిని అంతా టార్గెట్‌ చేశారని మండిపడ్డారు.

సనాతన అనే పదం పెరియర్ ద్వారానే అందరికీ తెలిసింది. ఆయన ఓ ఆలయంలో పనిచేసేవారు. నుదుటిపై తిలకం దిద్దుకుని వారణాసిలోని ఓ గుడిలో పూజలు చేసేవారు. అలాంటి వ్యక్తి వాటన్నింటినీ విడిచిపెట్టి ప్రజలకు సేవ చేయడం ప్రారంభించారంటే ఆయనకు ఎంత కోపం వచ్చి ఉంటుందో ఊహించంచాలన్నారు. డీఎంకే లేదా ఇతర ఏ పార్టీ కూడా పెరియర్‌ని తమ వారేనని చెప్పడానికి వీల్లేదు. ఎందుకుంటే ఆయన ఏ ఒక్క పార్టీకో చెందిన వ్యక్తి కాదన్నారు.

Also Read:Animal:యానిమల్‌లో అనిల్ కపూర్

- Advertisement -