మోదీకి కమల్‌ వీడియో మెసేజ్‌..

237
Kamal Hasan's Recording For Modi
- Advertisement -

తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ప్రధాని మోదీకి ఓ వీడియో సందేశాన్నిచ్చారు నటుడు కమల్‌సహాసన్‌. ఇటీవలే కమల్‌ ‘మక్కల్‌ నీది మయ్యం’ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే తమిళనాడులో కావేరీ జలాలకోసం జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో కమల్‌ రియాక్ట్‌ అయ్యారు.

‘గుడ్ మార్నింగ్ సర్, నా పేరు కమల్‌హాసన్.. గౌరవనీయ ప్రధానమంత్రికి నా ఓపెన్ వీడియో… కావేరీ వివాదంపై తమిళనాడులో జరుగుతోన్న ఆందోళనలు గురించి తెలిసే ఉంటాయి.. గతంలో నర్మద నది జల వివాదానికి బోర్డు ఏర్పాటుచేసి సులువుగా పరిష్కారం కనుగొన్నారు.. మరి తమిళనాడు ప్రజలు న్యాయం కోసం పోరాడుతున్నారు. న్యాయం వచ్చింది కానీ దానిని అమలు చేయడం లేదు. కర్ణాటక ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కావేరీ విషయంలో కేంద్రం ఆలస్యం చేస్తోందని ప్రజలు భావిస్తున్నారు. ఎన్నికల కంటే ప్రజలే ముఖ్యం, ఆ ఆలోచన దేశానికి ప్రమాదకరం, అవమానకరం… ఇది మారుతుందని ఆశిస్తున్నాను.. సుప్రీం తీర్పు ప్రకారం తమిళనాడు, కర్ణాటలకు న్యాయం చేయండి.. నా మాటల్లో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి’అంటూ ట్విట్టర్‌ లో ఓ వీడియోని పోస్ట్‌ చేశారు.

కాగా..రాష్ట్ర్రంలో కావేరీ నిర్వహణమండలి ఏర్పాటు చెయ్యాలని తమిళనాడు ప్రజలతో పాటు నేతలు, ప్రముఖులు కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తీర్పు అమలులో కేంద్రం తాత్సారం చేస్తుందంటూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించగా…మే 3 నాటికి ముసాయిదాను రూపొందించి తమకు అందజేయాలని కోర్టు ఆదేశించింది.

ఇదిలా ఉండగా..కావేరీ జలాలా ఆందోళనపై రజికాంత్‌ కూడా స్పందించారు. తమిళుల ఆందోళనల నేపథ్యంలో ప్రజలకు మద్దతునిస్తూ..ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడేటప్పుడు చెన్నై జట్టు సభ్యులు, వీక్షకులు నలుపురంగు బ్యాండ్‌లు కట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -