లోకనాయకుడు కమల్‌హాసన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం విక్రమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం డ్రగ్స్ నేపథ్యంలో సాగే అద్యంతం సాగే సినిమా ప్రేక్షకుల మనసులను దోచుకుంది. జూన్ 3న విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్‌ల కాసుల వర్షం కురిపించింది. తమిళంలో బహుబలి-2 రికార్డును బ్రేక్ చేసి ఇండస్ట్రీస్ హిట్‌గా నిలిచింది. కమల్ విశ్వరూపం సినిమా తర్వాత బ్లాక్ బస్టర్ మూవీగా టాక్ ఆఫ్ ది ఇండియాగా నిలిచింది. 1986లో వచ్చిన విక్రమ్ సినిమాలోని కథాంశంను ఇటివలే హిట్ అయిన ఖైదీ (కార్తీ) సినిమాలకు కొనసాగింపుగా ఈ చిత్రంను తెరకెక్కించారు. ప్రస్తుతం కమల్ తమిళ శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న ఇండియన్-2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
తాజాగా విక్రమ్ 100రోజులు పూర్తి చేసుకుంది. ఈ మధ్య కాలంలో ఒక సినిమా రెండు వారాలు అడుతుందంటేనే పెద్ద విషయం. కరోనా వల్ల సినిమాలు సరిగ్గా థియేటర్‌లో ఆడటంలేదు. కానీ విక్రమ్ 100రోజులు పూర్తి చేసుకొని తమిళ నాడులో ఇంకా రెండు మూడు థియేటర్లలో ప్రదిర్శితం అవతుందంటే విశేషం అనే చెప్పాలి. వంద రోజులు పూర్తయిన క్రమంలో కమల్ ఓ వాయిస్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ అవుతుంది. ఈ సినిమా ఓటీటీలో విడుదలై అక్కడ కూడా మంచి వ్యూవర్ షిప్‌ను సాధించింది. ఇప్పటివరకు ఈ చిత్రం అన్ని భాషల్లో కలిపి దాదాపు రూ.450కోట్లకు పైగా కలెక్షన్‌లను సాధించింది. తెలుగులో ఈ చిత్రానికి దాదాపు రూ.18 కోట్ల వరకు కలెక్షన్‌లు వచ్చాయి. దీంతో విక్రమ్ సినిమాకు తెలుగులో రూ.10కోట్లకు పైగానే ప్రాఫిట్స్ వచ్చాయి. హీరో నితిన్ శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని విడుదల చేశాడు.
యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ ఫాహాద్ ఫాజిల్, తమిళ స్టార్ విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు. సూర్య రోలెక్స్ పాత్రలో 5 నిమిషాలు మెరిసాడు. సూర్య పాత్ర సినిమాకే హైలేట్ అని చెప్పవచ్చు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్. మహేంద్రన్‌తో కలిసి కమల్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు.