కావాల్సింది డబ్బు కాదు..అభిమానం..

170
- Advertisement -

ఓ పక్క సినిమాలతో బిజీగా ఉంటూనే..‘బిగ్‌బాస్‌’ రియాల్టీ షోతో బుల్లితెరకు పరిచయమయ్యారు కమల్‌ హాసన్. సినిమాల్లో తనదైన శైలిలో ప్రయోగాలు చేసుకుంటూ.. కమర్షియాలిటీకి దూరంగా వెళ్తుంటాడు కమల్. అలాంటి వ్యక్తి బుల్లితెరకు రావడం.. అది కూడా ‘బిగ్ బాస్’ లాంటి కమర్షియల్ రియాల్టీ షో చేయడానికి అంగీకరించడం, చాలామందికి అంతుబట్టలేదు.

ఇందుకు ఏదో ప్రత్యేక కారణం ఉంటుందని అనుకున్నారు. ఐతే అలాంటిదేమీ లేదని తేల్చేశాడు కమల్. ప్రధానంగా ప్రేక్షకుల అభిమానం కోసమే ఈ షో చేయడానికి అంగీకరించినట్లు ఆయన వెల్లడించడం విశేషం.
Kamal Haasan Talks About His Big TV Debut With Bigg Boss
ప్రేక్షకులు తనని ఓ స్నేహితుడిగా భావించడానికి ఇదే సరైన సమయమని అన్నారు కమల్‌. ఈ షోల ద్వారా తనకొచ్చే డబ్బు కన్నా అభిమానుల సంఖ్య పెంచుకోవడమే ముఖ్యమని తెలిపారు. జీవితంలో తాను బలంగా కోరుకునేది అభిమానుల ప్రశంసలేనని అభిమానుల కోసం టెలిఫోన్‌ ద్వారా కూడా కార్యక్రమాలు చేస్తానని చెప్పుకొచ్చారు కమల్‌.

  Kamal Haasan Talks About His Big TV Debut With Bigg Boss

ఇటీవలే విజయ్ టీవీ కమల్ మీద కట్ చేసిన ‘బిగ్ బాస్’ షో జనాల్ని భలేగా ఆకట్టుకుంటోంది. అందులో కమల్ లుక్ అదుర్స్ అనిపిస్తోంది. ఈ షో చేస్తూనే చాలా ఏళ్లుగా మరుగున పడి ఉన్న ‘విశ్వరూపం-2’కు పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి ఈ ఏడాదే ఆ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నంలో ఉన్నాడు కమల్.

- Advertisement -