‘కాలా’కు మద్దతుగా కమల్…

214
kamal And Rajani
- Advertisement -

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం ‘కాలా’ రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. కావేరి జల వివాదం నేపథ్యంలో రజనీ వ్యాఖ్యలకు గాను కర్ణాటకలో కాలాను నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో రజనీకి చిత్ర వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే నటుడు ప్రకాశ్ రాజ్ మద్దతుగా నిలవగా.. తాజాగా కమల్ హాసన్ కూడా రజనీకి మద్దతుగా నిలిచారు. రజనీతో రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ సినిమాల పరంగా తాము ఒక్కటే అని మరోసారి నిరూపించారు.

Kamal-Haasan

ఈ సందర్భంగా కమల్ మీడియాతో మాట్లాడుతూ.. కాలా విషయంలో తన మద్దతు ఉంటుందన్నారు. రజనీ కాలా సినిమా కోసం ఎంతో మంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. తన విశ్వరూపం విడుదల సమయంలోను కర్ణాటకలో నిషేధించారని, కర్ణాటక ఫిలిం ఛాంబర్ విషయాన్ని సీరియస్ గా తీసుకుని సమస్యను పరిష్కరించాలని  సూచించారు.

ఇక కాలా విడుదలను అడ్డుకోలేమని కర్ణాటక హైకోర్టు తేల్చి చెప్పింది. కానీ భద్రత విషయంలో మాత్రం ప్రభుత్వానిదే బాధ్యతని సూచించింది. మరోవైపు బుధవారం ఉదయం కన్నడ సీఎం కుమార స్వామికి కన్నడ భాషలో రజనీ ఓ సందేశం పంపించారు. కాలా విడులయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. సినిమా విడుదలవుతున్న థియేటర్ల వద్ద భద్రత కల్పించారు కోరారు. మరి కన్నడ నాట రజనీ సందడి చేస్తాడో లేదో వేచి చూడాలి ఇక

- Advertisement -