సినీ లెజెండ్ కమల్ హాసనకు సంబంధించిన తాజా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోపంతో ఓ అభిమానిని ఆయన నెట్టివేసినట్టుగా ఉన్న ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఆ వీడియోలో కమల్, నటుడు రమేష్ అరవింద్‌తో కలిసి ఓ కార్యక్రమానికి హాజరై బయటకు వస్తున్నారు. ఆ సమయంలో ఓ అభిమాని కమల్‌ను చూసి వెంటనే కరచలనం చేయడానికి ప్రయత్నించాడు. అభిమానిని ఫస్ట్ రమేష్ అరవింద్ తోసి వేశారు.
ఇంతలో సెక్యూరిటీ గార్డును నెట్టుకుంటూ ఆ అభిమాని కమల్‌ను సమీపించే యత్నం చేయగా వెంటనే అభిమానిని కమల్ తన చేతులతో నెట్టి వేయడంతో అతను కింద పడ్డాడు. అక్కడి నుంచి కమల్ ఆగ్రహంతో వెళ్తున్నట్టుగా ఆ వీడియో ఉండటం చర్చకు దారి తీసింది. అయితే, ఆ వీడియో ఇప్పటిది కాదని కమల్ అభిమాన సంఘం నేతలు పేర్కొంటున్నారు.
ఇటీవల బెంగళూరులో ఆ ఘటన జరిగిందని.. ఇప్పుడు ఆ వీడియో ఎలా బయటకు వచ్చిందో తెలియడం లేదని చెబుతున్నారు. మొత్తానికి ఏది నిజమో స్పష్టత లేకపోయినా కమల్ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
https://www.youtube.com/watch?v=6olxwH0r5Mc