శశికళపై కమల్‌ షాకింగ్‌ ట్వీట్‌….

227
Kamal Haasan says justice will prevail
- Advertisement -

తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం కోసం ప్రయత్నిస్తున్న పన్నీర్‌ సెల్వంకు లైన్‌ క్లియరైంది. శశికళను దోషిగా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలవరించింది. చిన్నమ్మకు నాలుగేళ్లు జైలు శిక్షతో పాటు పదికోట్లు జరిమాన విధిస్తూ దేశ అత్యున్నత్య న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.

అయితే తమిళనాడు రాజకీయాలపై ప్రముఖ విలక్షణ సినీనటుడు కమల్‌హాసన్‌ ఈరోజు మరోసారి ట్వీట్టర్‌ వేదిగా స్పందించాడు. జయ ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు మరికొద్ది కాసేపట్లో తీర్పు వెలువరిస్తుందనగా కమల్‌ స్పందిస్తూ…. ‘‘మెరీనా ఆత్మ తీర్పు కోసం మౌనంగా ఎదురు చూస్తోంది’’ అని ట్వీట్ చేశాడు. మెరీనా ఆత్మ ఎప్పుడూ కోర్టు తీర్పులను గౌరవించారనీ… ఇకపైనా అదే కొనసాగిస్తారని ట్వీట్టర్‌లో పేర్కొన్నాడు. చట్టం ఏవరికి చుట్టం కాదని. చట్టం తనపని తాను చేసుకపోతోందని…ప్రజలు కూడా తమ కర్తవ్యాన్ని నెరవేర్చాల్సి ఉంటుంది అని కమల్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు.

Kamal Haasan says justice will prevail

కమల్‌హాసన్‌ ఈ వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటి తర్వాతే శశికళను దోషిగా పేర్కొంటూ సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది ముఖ్యమంత్రి కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న వీకే శశికళ జయలలిత కేసులో సహ నిందితురాలిగా ఉన్నారు. జయలలిత మరణానంతరం ఆమె స్థానంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు వీకే శశికళ, పన్నీర్ సెల్వం పోటీ పడుతున్న నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ వాతవరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే కమల్‌హాసన్‌ పలుసార్లు ట్విటర్ వేదికగా స్పందించాడు. ప్రస్తుతం తమిళనాడు పోలీసులు శశికళను అరెస్ట్‌ చేయడానికి పోయేస్‌గార్డెన్‌ బయలుదేరారు.

- Advertisement -