తమిళనాడు అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దూకుడు పెంచారు సినీ నటుడు,మక్కల్ నీది మయ్యం(ఎంఎన్‌ఎం) అధినేత కమల్ హాసన్. నవంబర్ 7 నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు త్వరలో ఓ ఛానల్‌ని ప్రారంభించాలని భావిస్తున్నారట. ఈ విషయాన్ని లీక్ చేశారు ఆ పార్టీ నేత మహేంద్రన్.
నవంబర్ 7న కోవైలో ప్రచారాన్ని ప్రారంభించనున్నారని.. కమల్ పుట్టినరోజున టీవీ చానల్ కూడా లాంఛ్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి? ప్రజలకు దగ్గరయ్యేందుకు ఏం చేయాలి? పార్టీని ఎలా బలపరచాలి? వంటి అంశాలపై దృష్టిసారిస్తున్నామని వెల్లడించారు.
ప్రస్తుతం తమిళ బిగ్ బాస్‌పై ఎక్కువ దృష్టిసారిస్తున్న కమల్ ఈ ఏడాది చివరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటడమే లక్ష్యంగా రాజకీయ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ ఐడియాలను ఇంప్లిమెంట్ చేస్తున్నారు.