హీరొయిన్ శృతిహాసన్ ఓ విదేశీ యువకుడితో డేటింగ్ లో ఉందని, అంతేకాకుండా వీరి మధ్య లవ్ ఎఫైర్ కూడా నడుస్తుందని ఇటీవలే సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ గా మారడం తెలిసిందే..! దాంతో ఆ విదేశీయువకుడు ఎవరా అని ఆరాతీస్తే..లండన్ కి చెందిన థియేటర్ ఆర్టిస్ట్ మైకేల్ కోర్సేల్ అని తేలింది.
అయితే తాజాగా శృతి ఎఫైర్ పై ఇప్పుడు మరింత క్లారిటీ వచ్చింది. ఆ విదేశీ యువకుడితో శృతి నిజంగానే లవ్‌లో ఉందని అంతా భావిస్తున్నారు. ఎందుకంటే శృతి కొత్త బాయ్‌ఫ్రెండ్‌గా సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఆ కుర్రాడు కమల్ హాసన్ తో కూడా కనిపించడంతో ఇక శృతి వ్యవహారం నిజమే అనుకుంటున్నారు శృతిఫ్యాన్స్.
అంతే కాకుండా ఈ విషయం శృతిఫ్యామిలీకి కూడా తెలుసని, ప్రస్తుతం ఆ యువడుకితో శృతి సహజీవనం చేస్తుందని కూడా టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. యూకె-ఇండియా ఇయర్ ఆఫ్ కల్చర్-2017 సదస్సుకు హజరైన కమల్..లండన్‌లో మైకేల్ కోర్సేల్ ను కలిసాడు. దీంతో శృతి ఎఫైర్ నిజమే అనే వార్తలకి కమల్ సాక్షంగా కనిపిస్తున్నాడని అంటున్నారు.
అయితే.. అతడితో సహజీవనం గురించి శృతి ముందే తన తండ్రికి చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉంటే..సోషల్ మీడియాలో శృతి లవ్ ఎఫైర్ గురించి ఇంత చర్చ జరుగుతున్నా..శృతి మాత్రం నోరు విప్పట్లేదు. ఎందుకంటే ఈ అమ్మడు సాధారణంగా తన పర్సనల్ ఎఫైర్ల గురించి మీడియాలో ఎక్కువగా మాట్లాడదు.