కల్కి దర్శకుడిపై కమల్!

12
- Advertisement -

మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 AD’ ఫస్ట్ ట్రైలర్ మ్యాసీవ్ రెస్పాన్స్ తో గ్లోబల్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆడియన్స్ ఎంతోగానో ఎదురుచూస్తున్న రిలీజ్ ట్రైలర్ ఇప్పుడు విడుదల చేశారు మేకర్స్. ఫస్ట్ గ్లింప్స్ భారతీయ పురాణాలలో రూట్ అయిన ‘కల్కి 2898 AD’ సినిమాటిక్ యూనివర్స్ ని ప్రేక్షకులకు పరిచయం చేస్తే, తాజా ట్రైలర్ ఇంకా డీప్ గా ఎపిక్ నెరేటివ్ ని మహా అద్భుతంగా చూపింది.

ఇక ఇప్పటికే కల్కి మేనియాతో ఫ్యాన్స్ పునకాలు లోడింగ్ అనేలా ఎంజాయ్ చేస్తుండగా తాజాగా కమల్ హాసన్ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కమల్…కల్కి సెట్‌లోని నిశ్శబ్దాన్ని నేను ఎక్కువగా ఆస్వాదించాను అని చెప్పారు. మిస్టర్ నాగి (నాగ్ అశ్విన్) చాలా కూల్ పర్సన్… కానీ పని విషయంలో సమర్ధత కలిగిన వ్యక్తి అని కొనియాడారు.

కల్కి 2898 AD’ ట్రూలీ పాన్-ఇండియన్ మూవీ, దేశవ్యాప్తంగా ఉన్న టాప్ ట్యాలెంటెన్స్ ని ఒకచోట చేర్చింది. ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ సహా ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ మల్టీలింగ్వెల్, మైథాలజీ -ఇన్స్ స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ ఫ్యూచర్ లో సెట్ చేయబడింది. ఈ మూవీ 2024 జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

Also Read:సంతాన సమస్యా..ఈ ఫుడ్ ట్రై చేయండి!

- Advertisement -