BB9:విజేత కళ్యాణ్

12
- Advertisement -

బిగ్‌బాస్ సీజన్–9 విన్నర్‌గా కామనర్ కళ్యాణ్ పడాల నిలిచాడు. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ కాన్సెప్ట్‌తో ప్రారంభమైన ఈ సీజన్‌లో చివరకు ఒక కామనర్, ఒక సెలబ్రిటీ టాప్–2లో నిలవడం విశేషంగా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ రేసులో కళ్యాణ్ ట్రోఫీని కైవసం చేసుకోగా, తనూజ రన్నరప్‌గా నిలిచింది.

105 రోజుల పాటు అహర్నిశలు శ్రమించి, అగ్నిపరీక్షలాంటిన టాస్కులను ఎదుర్కొంటూ బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన కళ్యాణ్, చివరకు “సరిలేరు నీకెవ్వరూ” అన్నట్లుగా విజయం సాధించాడు. టాప్–2లో నిలిచిన కళ్యాణ్, తనూజ ఇద్దరూ గోల్డెన్ బ్రీఫ్‌కేస్‌ను నిరాకరించడంతో హోస్ట్ నాగార్జున వారిద్దరినీ స్టేజ్‌పైకి ఆహ్వానించారు. కొద్దిసేపు ప్రేక్షకులను ఉత్కంఠలో ఉంచిన తర్వాత కళ్యాణ్‌ను విన్నర్‌గా ప్రకటించారు.

విజయం ప్రకటించగానే భావోద్వేగానికి లోనైన కళ్యాణ్ ఆనందంతో మోకాళ్లపై కూర్చుని అరవడం, నాగార్జున కాళ్లు పట్టుకుని ఆశీర్వాదం తీసుకోవడం అందరినీ కదిలించింది. అతడికి ట్రోఫీతో పాటు రూ.35 లక్షల ప్రైజ్‌మనీ చెక్, సుజుకీ కారు, రాఫ్ అడెసివ్ తరఫున మరో రూ.5 లక్షల చెక్కును నాగార్జున అందజేశారు.

రన్నరప్‌గా నిలిచిన తనూజ తన ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ, “మీ ప్రేమే నన్ను ఇక్కడి వరకూ తీసుకొచ్చింది” అని భావోద్వేగంగా మాట్లాడింది. ఆమె తల్లిదండ్రుల గురించి నాగార్జున ప్రత్యేకంగా ప్రస్తావించడం ఆకట్టుకుంది.

Also Read:కోడిగుడ్లతో క్యాన్సర్‌ ప్రమాదం లేదు!

విన్నింగ్ స్పీచ్‌లో కళ్యాణ్ తన తల్లిదండ్రుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ, “ఈ స్టేజ్‌పై నేను నిలబడ్డానంటే వాళ్ల పెంపకమే కారణం” అని అన్నారు. చివరగా తనకు ధైర్యం ఇచ్చిన వారిని ప్రస్తావిస్తూ, “లాస్ట్ బట్ నాట్ లీస్ట్… లేడీ క్వీన్ తనూజకి థాంక్స్. ఒక సందర్భంలో నాకు ముందుకు నడిచే ధైర్యం ఇచ్చింది ఆమెనే” అంటూ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నాయి.

- Advertisement -