స్టన్నింగ్‌ కల్యాణ్ రామ్..

281
Kalyan Ram's Six Pack Making and Transformation for ISM
Kalyan Ram's Six Pack Making and Transformation for ISM
- Advertisement -

చాలా కాలం తరువాత పటాస్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు నందమూరి హీరో కళ్యాణ్‌ రామ్. ప్రస్తుతం ఇజం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తన కెరీర్లోనే బిగెస్ట్ బడ్జెట్తో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై కళ్యాణ్ రామ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఇజం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కమ్యూనిజం, హ్యూమనిజం, ఫెమినిజం.. ఇలా ఎన్నో ఇజాలు తెలిసిందే. కానీ ‘ఇజం’ అనే సినిమాలో కొత్త ఇజం వుంటుందనీ, ఇలా వుంటేనే సమాజం బాగుంటుందనే అందరికీ అనిపిస్తుందని… కథానాయకుడు కళ్యాణ్‌ రామ్‌ అంటున్నారు.

ఇక హీరోలను పక్కా మాస్‌గా చూపించడంలో పూరి జగన్నాథ్‌ శైలే వేరు. ‘ఇడియట్‌’ నుంచి ‘లోఫర్‌’ వరకు ఆయన సినిమాల్లో హీరోలు రఫ్‌ అండ్‌ టఫ్‌గా ఉంటారు. గత చిత్రాలకు భిన్నంగా కల్యాణ్‌రామ్‌ ఈ చిత్రంలో ‘సిక్స్ ప్యాక్’లో కనిపించనున్నాడు. అయితే, ఈ సిక్స్ ప్యాక్ కోసం కల్యాణ్ రామ్ ఎంతగా కష్టపడ్డాడనే విషయాన్ని వివరించేందుకు పూరీ ఒక వీడియో విడుదల చేశాడు. అభిమానులతో పంచుకున్న ఈ వీడియో ఆకట్టుకుంటోంది. కల్యాణ్ రామ్ తన కోచ్ సమక్షంలో ఏ విధంగా తన బాడీని సిక్స్ ప్యాక్ గా మలిచాడో ఈ వీడియోలో మనం చూడొచ్చు. ఈ నెల 21న ‘ఇజం’ విడుదల కానున్న నేపథ్యంలో ఈ వీడియోను విడుదల చేయడం గమనార్హం.

- Advertisement -