ఎప్పటికీ మీరే మా స్పూర్తి:కళ్యాణ్ రామ్

257
- Advertisement -

నాన్న నువ్వు ఎక్కడికి వెళ్లలేదు.. మా గుండెల్లో ఉన్నావు..మీరే ఎప్పటికి మా స్పూర్తి అంటూ తండ్రి హరికృష్ణను గుర్తుతెచ్చకుని భావోద్వేగానికి లోనయ్యారు హరికృష్ణ. ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో మాట్లాడిన కల్యాణ్‌ రామ్‌ కంటతడి పెట్టారు. కల్యాణ్ రామ్ ప్రసంగిస్తున్నంత సేపు ఎన్టీఆర్ సైతం ఎంటతడి పెట్టారు.

నెలక్రితం జరిగిన సంఘటనతో చాలామంది సినిమా రిలీజ్ వాయిదా పడుతుందని అనుకున్నారని కానీ ప్రొడ్యూసర్ బాగుండాలి…వృత్తి పట్ల నిబద్ధత ఉండాలి మా నాన్న చెప్పిన మాటలు గుర్తుకొచ్చి సినిమాను పూర్తిచేశామన్నారు.

1962వ సంవత్సరంలో మేకప్‌ వేసుకుని షూటింగ్‌ కు వెళ్లిన మా తాతగారు, మన అన్నగారు నందమూరి తారక రామారావుగారు షూటింగ్‌లో ఉండగా, ఒక అశుభ వార్త వినాల్సి వచ్చింది. ఆయన పెద్ద కొడుకు నందమూరి రామకృష్ణగారు కన్నుమూశారని తెలిసింది. కొడుకు చనిపోతే ఏ తండ్రీ తట్టుకోలేడు. కానీ, ఆయన లొకేషన్‌లో ఉన్నారు. ఆ ప్రొడ్యూసర్‌కు నష్టం రాకూడదని, రోజంతా షూటింగ్‌ చేసి అప్పుడు వెళ్లారట. వృత్తిధర్మం అలాంటిదని గుర్తుచేశారు.

- Advertisement -