జూనియర్ ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటించిన బాబీ దర్శకత్వంలో హీరో కళ్యాణ్ రామ్ నిర్మాతగా నిర్మించిన చిత్రం జై లవ కుశ. ఈ సినిమాలో రాశి ఖన్నా, నివేదా థామస్ కథానాయికలుగా నటిస్తున్నారు.సెప్టెంబర్ 21న భారీ అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.
ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్, ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాతగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. బాబీ ఈ సినిమా టైటిల్ తో సహా స్క్రిప్ట్ ను నాకు వినిపించాడు. పదే పది నిమిషాల్లో ఓకే చేశాను. ఈ సినిమాకు ఎన్టీఆర్ మాత్రమే సెట్ అవుతాడని భావించి, తమ్ముడికి చెబితే, ఈ సినిమాను ఓకే చేసేందుకు వారం రోజుల సమయం తీసుకున్నాడు.. అలా ఎందుకు చేశాడో, అప్పుడు నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత, ఎందుకని ఆలోచిస్తే ఈ స్టోరీ చెప్పిన ఆ క్షణం నుంచి ఎన్టీఆర్ ఆ కేరక్టర్లో లీనమైపోయాడు..
తర్వాత మొదట రావణ క్యారెక్టర్ తో సినిమా షూటింగ్ మొదలుపెట్టాం. అప్పటినుండి ప్రతి రోజు , ప్రతీ క్షణం, పాత్రలో లీనమైపోయాడు.. ఒకరోజు రాత్రి మూడు గంటలకు ఏం జరిగిందంటే.. మూడింటికి నిద్రలో నడిచేస్తూ నత్తితో మాట్లాడుతున్నాడు.. నిద్రలో నడుచుకుంటూ పోయి కిటికి ఓపెన్‌చేసి కాళ్ళు బయట పెట్టి అలా కూర్చున్నాడు.. అప్పుడు తనకు కాలికి చిన్న అద్దం ముక్క గుచ్చుకుంది. అప్పుడా విషయం తనకు కూడా తెలియదు.
తర్వాత రోజు జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి ఫోన్ చేసి చెబితేగానీ ఎవరికీ తెలియదు. అప్పటికిగాని నాకు అర్థం కాలేదు.. ఎన్టీఆర్ తన పాత్రలో ఎంత లీనమైపోయాడో…. రాత్రిపూట తెలియకుండా నిద్రలేచి నత్తిలో మాట్లాడుతూ ప్రణతి చాలా భయపడింది. ఎన్టీఆర్‌కు ఏమవుతుందని ప్రణతి భయపడితే.. నేను ధైర్యం చెప్పాను.. అప్పుడు వారం రోజులు రెస్ట్ తీసుకోమని తారక్‌కి చెప్పాను.. తమ్ముడు నీ బ్రెయిన్ పాత్ర గురించి ఎక్కువ ఆలోచిస్తుందని అన్నాను.. అప్పుడు తారక్ ఒకటే అన్నాడు.. అన్నా.. మనం ఫ్యాన్స్‌కి ఒక్కటే ప్రామిస్ చేశాం.. సెప్టెంబర్‌లో సినిమా రిలీజ్ చేస్తామని…. మనం చేయాలని మళ్లీ షూటింగ్ కు వచ్చేశాడని కళ్యాణ్ రామ్ చెప్పాడు..