Kalyan ram:నా మాట తీసుకోండి.. రాసుకోండి

31
- Advertisement -

వైవిధ్య‌మైన సినిమాల‌ను చేస్తూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న టాలీవుడ్ హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌. ఆయ‌న క‌థానాయ‌కుడిగా నటిస్తోన్న లేటెస్ట్ పీరియాడిక్ స్పై థ్రిల్ల‌ర్ ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా దర్శక నిర్మాతగా రూపొందిన డిసెంబర్ 29న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం చిత్ర యూనిట్ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో…

రైటర్ శ్రీకాంత్ విస్సా మాట్లాడుతూ …కళ్యాణ్ రామ్‌గారు నాపై ఉంచని నమ్మకానికి, నాకు ఇచ్చిన సపోర్ట్‌కి చాలా థాంక్స్. అలాగే దర్శక నిర్మాత అభిషేక్ గారికి కూడా థాంక్స్. ఇంకా సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్‌కి, ఎడిటర్ తమ్మిరాజుగారికి థాంక్స్. హర్షవర్ధన్ రామేశ్వర్ గారు గ్రేట్ మ్యూజిక్‌ను అందించారు. అందరికీ థాంక్స్ అన్నారు.సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్ మాట్లాడుతూ..ఈ సినిమాకు నన్ను సినిమాటోగ్రాఫర్‌గా తీసుకోమని కళ్యాణ్ రామ్‌గారే సజెస్ట్ చేశారు. అభిషేక్‌గారు అద్భుతంగా సపోర్ట్ చేశారు. డిసెంబర్ 29న మీ ముందుకు వస్తున్నాం అన్నారు.

చిత్ర దర్శక నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ ..డెవిల్ ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుంది. ఇలాంటి కొత్త కాన్సెప్ట్ సినిమా చేయాలంటే, కథను నమ్మి హీరో ముందుకు రావాలంటే గొప్ప విషయం. రెండేళ్ల పాటు కళ్యాణ్ రామ్‌గారు మరో సినిమా ఏదీ చేయకుండా వర్క్ చేశారు. ట్రైలర్‌లో కళ్యాణ్ రామ్‌ ని చూసింది తక్కువ. రేపు థియేటర్స్‌లో ఆయన విశ్వరూపాన్ని చూస్తారు. యాక్షన్, పెర్ఫామెన్స్ అదిరిపోతుంది. ఇలాంటి పీరియాడిక్ మూవీ చేయాలంటే మంచి టీమ్ వర్క్ ఉండాలి. సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్‌గారు, శ్రీకాంత్‌గారు, యాక్షన్ మాస్టర్ వెంకట్‌గారు ఇలా అందరూ రెండేళ్లు ఈ మూవీలో పార్ట్ అయ్యారు. ఈ ఏడాది వీరసింహా రెడ్డి వంటి బ్లాక్ బస్టర్‌తో స్టార్ట్ అయ్యింది. డిసెంబర్ 29న డెవిల్ వంటి బ్లాక్ బస్టర్‌తో కంప్లీట్ అవుతుంది. సంయుక్తా మీనన్, మాళవికకు థాంక్స్. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్ అన్నారు.

Also Read:ఏపీపై కాంగ్రెస్ ప్లాన్ అదే!

- Advertisement -