ఇటివలే మాద్యమాల్లో ప్రసారమవుతున్న కళ్యాణ్ జువెల్లర్స్ యాడ్ కు బ్యాంకుల నుంచి తీవ్ర వ్యతికరేకత వచ్చిన విషయం తెలిసిందే. తెలుగులో నాగార్జున, హిందీలో అమితాబ్ బచ్చన్ లతో రూపొందించిన ఈ యాడ్ లు ఇక పై టీవిలో కనిపించవు. కళ్యాణ్ జువెల్లర్స్ చేస్తున్న ప్రకటన వల్ల బ్యాంకులపై ప్రజలకు నమ్మకం పోయేలా ఇ యాడ్ ఉందని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఈయాడ్ అన్ని మాద్యమాల్లో నుంచి తొలగిస్తున్నట్లు కళ్యాణ్ జువెల్లర్స్ ప్రకటించింది.
అంతేకాకుండా ఆయాడ్ ను తెరకెక్కించినందుకు కళ్యాణ్ జువెల్లర్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏఐబీవోసీ హెచ్చరించింది. ఈయాడ్ ను కేవలం ప్రచారం కోసమే చిత్రికరించామని, ఎవరిని ఉద్దేశించి ఈయాడ్ ను రూపొందించలేదని తెలిపారు కళ్యాణ్ జువెల్లర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేశ్ కళ్యాణరామన్. ఈయాడ్ వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని కొంతమంది తమకు ఫిర్యాదు చేశారని తెలిపారు. తమ వ్యాపారంలో బ్యాంకింగ్ వ్యవస్ధది కీలకపాత్ర అని..ఈసందర్భంగా బ్యాంకులకు ఇబ్బంది కలిగేలా ఈయాడ్ ఉన్నందుకు చింతిస్తున్నామని అందుకే తక్షణమే ఈయాడ్ ను తొలగిస్తున్నామన్నారు.