BB9:కెప్టెన్‌గా కళ్యాణ్

7
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 33 రోజులు పూర్తి చేసుకుంది. వచ్చే వారం హౌస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు కళ్యాణ్‌. అయితే తనూజని ఒక్క మట అడగ్గానే కళ్యాణ్‌ని సేఫ్ చేసి తను డేంజర్‌లోకి వెళ్లిపోయింది.

డేంజర్ జోన్‌లో ఉన్నవారిలో ఒకర్ని సేవ్ చేసేందుకు బిగ్‌బాస్ లాస్ట్ ఛాన్స్ ఇచ్చాడు. డేంజర్ జోన్‌లో ఉండే సభ్యులకి వచ్చే ఫైర్ స్ట్రామ్ నుంచి సేవ్ అవ్వడానికి లాస్ట్ ఒక్క ఛాన్స్ ఇస్తున్నాను.. బిగ్‌బాస్ హౌస్‌లో మీ సర్వైవల్ కోసం నేను ఇస్తున్న టాస్క్ ఫైట్ ఫర్ సర్వైవల్.. గార్డెన్ ఏరియాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీటితో నిండే పూల్స్ ఉన్నాయి.. అందులో నీళ్లు చల్లగా ఉండొచ్చు కానీ అవే మీకు అగ్నిపరీక్ష.. ఎందుకంటే స్టార్ట్ బజర్ మోగగానే డేంజర్ జోన్‌లో ఉన్న సభ్యులు తమకు కేటాయింటిన పూల్స్‌లోకి వెళ్లి అందులో ఉన్న రోప్స్‌ని పట్టుకొని పూర్తిగా పడుకోవాలి.. ఆ పూల్స్‌కి కనెక్ట్ చేసిన ట్యాప్స్ ద్వారా ఆ పూల్స్‌లో నీరు క్రమంగా ప్రతి సెకను మీ సహనాన్ని మీ శ్వాసని మీ ధైర్యాన్ని పరీక్షిస్తాయి.. సేఫ్‌ జోన్‌లో ఉన్న సభ్యులు డేంజర్ జోన్‌లో ఉన్న ఎవరిని డేంజర్ జోన్‌ నుంచి సేవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ల పూల్‌లో నీటిని బకెట్‌తో బయటికి తీసి డేంజర్ జోన్‌లోనే ఉంచాలనుకుంటున్న సభ్యుని పూల్‌లో వేయాల్సి ఉంటుంది అని చెప్పారు.

తనూజకి సపోర్ట్ చేస్తానని భరణి చెప్పాడు. సుమన్ శెట్టికి రాము, రీతూకి దివ్య, శ్రీజకి కళ్యాణ్, సంజనకి ఇమ్మూ సపోర్ట్ చేశారు.
ఈ టాస్కులో నెక్స్ట్ డీమాన్ ఔట్ అయిపోయాడు. ఎందుకంటే డీమాన్‌కి ఎవరూ సపోర్ట్ చేయలేదు. దీంతో మొత్తానికి డేంజర్ జోన్ నుంచి తనూజ కూడా సేఫ్‌ అయిపోయింది.

Also Read;KTR:కోయంబత్తూరుకు కేటీఆర్

తర్వాత కెప్టెన్సీ టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్. రేసులో మిగిలిన తనూజ-కళ్యాణ్‌లలో కెప్టెన్ ఎవరు కావాలో డిసైడ్ చేసే పవర్ డేంజర్ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్ల చేతిలో పెట్టాడు బిగ్‌బాస్. డేంజర్ జోన్‌లో ఉన్న సభ్యులందరూ వీళ్లిద్దరిలో ఎవరికి కెప్టెన్ అయ్యే అర్హత లేదనుకుంటే వాళ్ల లైట్ ఆఫ్ చేయండి.. అని బిగ్‌బాస్ అన్నాడు. అందులో డీమాన్, రీతూ, శ్రీజ.. కళ్యాణ్‌కి సపోర్ట్ చేయగా సుమన్, సంజన మాత్రమే తనూజకి మద్దతు ఇచ్చారు. దీంతో కళ్యాణ్ కెప్టెన్ అయిపోయాడు.

- Advertisement -