చిరు చిన్నల్లుడు విజేత టీజర్ వచ్చేసింది..

248
Vijetha teaser
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ తొలి చిత్రం విజేత. ఈ చిత్రంతో కల్యాణ్ దేవ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ ప్రేక్షకులలో ఆసక్తి పెంచింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు.

Kalyan dev Vijetha teaser

మనసుకు నచ్చిన పని చేసుకుంటూ బతకడం అందరికీ సాధ్యం కాదు నాన్న, లైఫ్ లో కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి తప్పదు. అయినా నీవు అలా అవ్వకూదనే నీకు నచ్చిన రూట్ సెలెక్ట్ చేసుకుని నీవు హ్యాపీగా బ్రతకాలనే చిన్నప్పటి నుంచి నీకు ఏది ఇష్టమో అదే ఇస్తూ వచ్చా నా వల్ల అయినంత అంటూ కల్యాణ్ దేవ్ తో మురళీ శర్మ చెప్పే డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కొడుకు ప్రయోజకుడు కావాలనే ఆరాటపడే తండ్రి పాత్రలో మురళీ శర్మ ఒదిగిపోయారు. ఇక తండ్రి మాటలను పట్టించుకోకుండా బేవార్స్ గా తిరిగే కొడుకు పాత్రలో కళ్యాణ్ దేవ్ నటన బాగుంది.

టీజర్ చూస్తుంటే తండ్రి కొడుకుల మధ్య అనుబంధం నేపథ్యంలో సాగే కథాలా ఉంది. టీజర్ లో కేవలం తండ్రి కొడుకుల సీన్స్ మాత్రమే కట్ చేశారు. కొద్దిగా కల్యాణ్ ప్రేమ గురించి కూడా చూపించారు. ఇందులో కల్యాణ్ దేవ్ సరసన మాళవికా నాయర్ నటిస్తోంది. రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. రజనీ కొర్రపాటి నిర్మిస్తున్నారు. మామయ్య సూపర్ హిట్ చిత్రం విజేత అల్లుడి సినిమాకి టైటిల్ పెట్టడంతో ప్రేక్షకులలో అంచనాలు పెరిగిపోయాయి. భారీ అంచానాలతో జూలైలో ప్రేక్షకుల ముందుకు రానేంది ఈ చిత్రం.

- Advertisement -