విజేత… ఫస్ట్ సింగిల్‌ ట్రాక్‌

225
- Advertisement -

మెగాస్టార్‌ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్‌దేవ్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం విజేత. రాకేశ్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలె టాకీ పార్ట్ పూర్తిచేసుకుంది. జూలై గ్రాండ్‌గా సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కళ్యాణ్ దేవ్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించగా వారాహి చలన చిత్రం బ్యానర్ లో సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మించారు. ‘బాహుబలి’ కెమెరామెన్ కె.కె.సెంధిల్ సినిమాటోగ్రఫర్ గా పనిచేశారు.

ప్రస్తుతం సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఫస్ట్ సింగిల్ ట్రాక్‌ను ఈ నెల 22న విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. కోడికి సంతాపం అంటూ కొ…కొక్కొరొకో సాంగ్‌ను 22న ఉదయం 8.09 గంటలకు విడుదల చేస్తున్నట్లు పోస్టర్‌ని విడుదల చేశారు. అంతేగాదు ఈ నెల 24న ఆడియో విడుదల చేయనున్నట్లు తెలిపింది.

సినిమా ఫస్ట్ లుక్‌ దగ్గరి నుంచి విజేత టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే. విజేత టీజర్‌ యూట్యూబ్ లో నెంబర్ వన్ స్థానంలో ఉండడమే కాకుండా 1 మిలియన్ డిజిటల్ వ్యూస్ వచ్చాయి. టీజర్ లో కళ్యాణ్ దేవ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ చక్కగా కనబరిచాడు.

Vijetha

- Advertisement -