రుక్మిణి కృష్ట నాట్య ప్రదర్శనతో కళను కాపాడేందుకు దీపీక రెడ్డికి,దీపాంజలి సంస్ధకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు జాగృతి అధ్యక్షురాలు కవిత. కళను కాపాడేందుకు దీపికా రెడ్డి కృషి చేస్తుందని..ప్రజల్లోకి ఈ కళను తీసుకువెళ్ళాలన్నారు. ఈ కళాకారుల కష్టం ప్రతి ఫ్రెమ్ లో కనిపిస్తుందని.. ఆద్యంతం ఆకట్టుకుంది ప్రభుత్వం నుండి దీనికి తోడ్పాటు కలిపించే విధంగా కృషి చేస్తానని చెప్పారు.
రుక్మిణి కల్యాణం నృత్య రూపం అందరి మంత్ర ముగ్ధుల్ని చేసిందని మైహోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్ రావు అన్నారు. ఇలాంటి కళాఖండాలను ప్రోత్సహించాలి..భాగవతం మొత్తాన్ని గంటన్నర లో చేసి చూపించారని చెప్పారు. ప్రస్తుతం కళలకు ఆదరణ లేదు కానీ మనం ప్రోత్సహించాలి..ఇలాంటి కళలు మన మనస్సు ఆనందం ఇవ్వడమే కాకుండా మనను భక్తి వైపు నడిపిస్తాయని చెప్పారు.
రుక్మిణి కృష్ట నాట్య ప్రదర్శన చేయడం నా అదృష్టం అన్నారుదీపాంజలి నాట్య గురువు దీపికా రెడ్డి. దీపాంజలి విద్యార్థుల కృషి తోనే ఇది సాధ్యమైందని..మహిళలను ప్రోత్సహిస్తే ఎంత ఎతైన ఎదుగుతారని చెప్పారు.
దీపాంజలి విద్యార్థులు దీపికారెడ్డి ఆధ్వర్యంలో రుక్మిణి కృష్ణ నృత్య ప్రదర్శన నయనాయనందకంగా ఉందన్నారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. భారతీయ సంగీతం ,నృత్యం గొప్పతనాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటుతుందన్నారు. ప్రధాన పాత్రలే కాకుండా అందరూ తమ అద్వితీయమైన ప్రదర్శన చేశారు..మన తెలుగు భాష ,సంస్కృతి సంప్రదాయాలు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ఇలాంటి కార్యక్రమాలు వాటికి దోహదపడతాయని చెప్పారు.