ఉస్మానియా విద్యార్ధికి మాజీ ఎంపీ కవిత చేయూత

258
kavitha
- Advertisement -

కష్టపడి చదివి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో సీటు సంపాదించిన గిరిజన యువకుడి ఉన్నత చదువులకు మాజీ ఎంపీ ‌కల్వకుంట్ల కవిత ఆపన్న హస్తం అందించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి కి చెందిన కూరాకుల మహేష్, ఐఐఎం రాంఛీలో సీటు సంపాదించారు.

మహేష్ తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు కాగా, కాలేజీ లో‌ సీటు ఖరారు చేసుకోవడానికి రూ. లక్ష రూపాయలు చెల్లించాల్సి ఉండగా.. నిరుపేద కుటుంబానికి చెందిన మహేష్ కు, అడ్మిషన్ ఫీజు చెల్లించడం భారంగా మారింది. అంతేకాదు అడ్మిషన్ ఫీజు చెల్లించాల్సిన తేదీ దగ్గర పడుతుండటంతో, మహేష్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.

దీంతో‌ సహాయం ‌చేయాల్సిందిగా మాజీ ఎంపీ ‌కవితను ట్విట్టర్ ద్వారా కోరారు మహేష్. దీనిపై స్పందించిన మాజీ ఎంపీ కవిత, మహేష్ అడ్మిషన్ ఫీజు చెల్లించేందుకు ముందుకు వచ్చారు. అడిగిన వెంటనే స్పందించి, ఉన్నత ‌చదువులకు సహకరించినందుకు, మహేష్ ‌కుటుంబ సభ్యులు మాజీ ఎంపీ ‌కవిత గారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఉన్నత లక్ష్యాలను సాధించాలనుకునే యువకులకు, విద్యార్థులకు పేదరికం అడ్డంకి కాదని మహేష్ నిరూపించారని కల్వకుంట్ల కవిత అన్నారు. వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన మహేష్ ఐఐఎంలో సీటు సాధించడం పట్ల ఆయన అభినందించిన, ఆయనకు అండగా ఉంటామని తెలిపారు. ఈ మేరకు ఆయనను స్వయంగా కలిసిన కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపి లక్ష రూపాయల చెక్కుని అందించారు.

- Advertisement -