కాలుష్య నివారణే మా లక్ష్యం:కేటీఆర్

67
- Advertisement -

తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి ఎక్కువ ప్రాధాన్యతమిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో మొబిలిటీ వ్యాలీ ద్వారా నాలుగు లక్షల ఉద్యోగాల కల్పన 6లక్షల బిలియన్ల పెట్టుబడి లక్ష్యమన్నారు. నగరంలో కాలుష్యాన్ని తగ్గించడమే మా లక్ష్యమే అని ఈ మొబిలిటీ వీక్‌లో భాగంగా జరిగిన ఈవీ సదస్సులో ఆయన పాల్గొన్నారు. రంగారెడ్డిలోని మోమిన్‌పేట్ మండలం ఎంకతాలలో మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేయనున్నట్టు కేటీఆర్‌ ప్రకటించారు.

ఈ మొబిలిటీ సదస్సులో భాగంగా బాష్‌ వంటి పలు దిగ్గజ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తెలంగాణలో ఈవీ మ్యాన్‌ఫ్యాక్చర్ క్లస్టర్స్‌ ఉన్నాయన్నారు. మరో నాలుగు మొబిలిటీ క్లస్టర్స్ ఏర్పాటుకు పిలుపునిస్తామని అన్నారు. స్టార్టప్‌లు ఆవిష్కరణలు సరికొత్త ఆలోచనలకు ఎంతో మద్దతు ఇస్తున్నామని కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి…

భూకంప బాధిత దేశాలకు భారత్ సాయం

మోదీ మౌనం వీడాలి…

జగన్ కు విశాఖా స్ట్రోక్.. తగలనుందా?

- Advertisement -