జైనీ క్రియేషన్స్ పతాకంపై మూలవిరాట్, పద్మ,రాజ్ కుమార్, స్వప్న నటీ నటులుగా అమ్మ నీకు వందనం, క్యాంపస్ అంపశయ్య’, ప్రణయ వీధుల్లో’, వంటి ప్రయోజనాత్మక ‘ సినిమాలు తీసిన ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో శ్రీమతి విజయలక్ష్మీ జైనీ నిర్మించిన చిత్రం ‘ప్రజాకవి కాళోజీ’ బయోపిక్!.. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 23 న విడుదలకానుంది.
చిత్ర దర్శకుడు ప్రభాకర్ జైనీ మాట్లాడుతూ…మన కాలపు మహాకవి కాళోజీ గారి సందేశం, మన విద్యార్థులకైనా చేరితే, సినిమా తీసిన ప్రయోజనం నెరవేరుతుందనే ఉద్దేశ్యంతో తెలంగాణా ముఖ్యమంత్రి గారి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డిగారిని కలవడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించడం చాలా సంతోషంగా ఉంది. దీంతో ఇప్పుడు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో డిసెంబరు 23 నుండి 29 డిసెంబరు వరకు 24 థియేటర్లలో, వారం రోజుల పాటు రోజూ ఒక్క మార్నింగ్ షో మాత్రమే ఉదయం 9 నుండి 11 గంటలకు, అదీ స్కూలు పిల్లలకు ఉచితంగా. ఈ క్రింది థియేటర్లలో ప్రదర్శిపబడుతుంది. ఇంతకంటే ఇంకా ఎక్కువగా విడుదల చేయలేనందుకు నాకూ బాధగానే ఉంది. కానీ.. ఎవ్వరు కూడా ఈ సినిమా కమర్షియల్ గా నడవదనీ, రిలీజ్ చేసే సాహసం చేయలేమని అశక్తత వ్యక్తం చేయడంతో ఈ విధంగా చేయవలసి వచ్చింది. పిల్లలకు బాగా నచ్చి, వారే రాయబారులై సినిమా అందరూ చూడాలని ఉద్యమిస్తే, రెగ్యులర్ షోస్ వేసే అవకాశం కలుగుతుంది. లేదా కనీసం OTT లో విడుదలకై అవకాశం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అలాగే ఈ కార్యక్రమంలో , ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారు, శ్రీ వేముల శ్రీనివాసులు(ఓ యస్ డి) , సీఎంఓ సోదరుడు మూర్తి పాత , డిప్యూటీ సెక్రటరీ తెలంగాణ గవర్నమెంట్ గారు, తెలంగాణా స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ అండ్ కామర్స్ హానరరీ సెక్రెటరీ అనుపమ్ రెడ్డి గారు తమ వంతు సహకారం అందించారు. ప్రభుత్వంలో ఒక ఫైల్ అప్రూవ్ కావడానికి అనేక చిక్కులు ఉంటాయి. అవన్నీ దాటడంలో అనేక మంది మితృలు సహకరించారు. వారందరికీ నా ధన్యవాదాలు చెప్పారు.
Also Read:పీవీ…తెలంగాణ ఠీవి!