Kalki Review:కల్కి ట్విట్టర్ రివ్యూ..

218
- Advertisement -

హైలీ యాంటిసిపేటెడ్ మాగ్నమ్ ఓపస్ కల్కి 2898 AD. ఇండియన్ సినిమాకు చెందిన ఇద్దరు లెజెండ్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత రీయూనియన్ కావడం. వీరిద్దరూ 1985 కల్ట్ క్లాసిక్ గెరాఫ్తార్‌లో స్క్రీన్‌ షేర్ చేసుకున్నారు. బ్రదర్స్ కరణ్, కిషన్ పాత్రలను పోషించారు. సెప్టెంబరు 13, 1985న విడుదలైన ఈ చిత్రం నేటికీ అందరికీ ఇష్టమైన క్లాసిక్‌గా నిలిచింది.కల్కి 2898 ADలో కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ పాత్రను పోషించారు. ఈ క్యారెక్టర్ లో కమల్ హసన్ లుక్, గెటప్ అందరినీ చాలా సర్ప్రైజ్ చేసింది.

సుప్రీం యాస్కిన్ క్యారెక్టర్ లో కమల్ హసన్ మేకోవర్ అన్ బిలివబుల్ అండ్ స్టన్నింగ్ గా వుంది. మునుపెన్నడూ చూడని మైండ్ బ్లోయింగ్ అవతార్ లో అద్భుతంగా అలరించబోతున్నారు కమల్ హసన్. ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మాగ్నమ్ ఓపస్ లోబిగ్గెస్ట్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే, దిశా పటానీ కీ రోల్స్ పోషించారు.

ఇక సినిమా చూసిన ప్రేక్షకులు వరల్డ్ క్లాస్ మూవీ అంటూ రేటింగ్ ఇచ్చేస్తున్నారు. తొలి 15 నిమిషాలు అస్సలు మిస్ కావొద్దంటూ వెల్లడించారు. ఫస్టాఫ్ వరల్డ్ క్లాస్‌గా హాలీవుడ్ లెవల్‌లో ఉందన్నారు. థియేటర్స్‌లో తప్పక చూడాల్సిన సినిమా అని…ప్రతి 10 నిమిషాలకు ఒక కొత్త క్యారెక్టర్ సర్ ప్రైజ్ చేస్తుందని కామెంట్ చేస్తున్నారు.

అర్జునుడి పాత్రలో విజయ్ దేవరకొండ సర్‌ప్రైజ్ చేశాడని…ఇది ఖచ్చితంగా రెబల్ డే అంటూ మరో నెటిజన్ స్పందించాడు.ప్రభాస్ ఎంట్రీ సీన్ పూనకాలే అని చెబుతున్నారు. దుల్కర్, విజయ్ దేవరకొండ, రాజమౌళి, ఆర్జీవీలు కీలక పాత్రల్లో కనిపించి సర్ ప్రైజ్ చేశారని 4.5 రేటింగ్ ఇస్తున్నారు.

Also Read:తొలిసారి ఫైనల్‌కు సౌతాఫ్రికా

- Advertisement -