నైజాంలో కల్కి..వసూళ్లు అదుర్స్!

14
- Advertisement -

భారీ అంచ‌నాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది కల్కి 2898AD.నాగ్‌ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందించిన ఈ చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్‌, ప్ర‌భాస్‌, దీపికా ప‌దుకొణె, దిశాప‌టానీ కీల‌క పాత్రలు పోషించిన సంగ‌తి తెలిసిందే.

27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సక్సెస్ టాక్‌ని సొంతం చేసుకుంది. నాగ్ అశ్విన్ దర్శక ప్రతిభకు అంతా ఫిదా అవుతున్నారు. రూ.600 కోట్ల బ‌డ్జెట్ తో అశ్వినీదత్ నిర్మించగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు చేరుకోవాలంటే రూ.395 కోట్ల షేర్ వ‌సూళ్లు సాధించాలి. అంటే దాదాపు రూ.800 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు చేయాలి.వరల్డ్ వైడ్ గా రికార్డు ఓపెనింగ్స్ ని అందుకోగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం రికార్డు వసూళ్లు మొదటి రోజు అందుకుంది.

నైజాం మార్కెట్ లో మొదటి రోజే ఈ చిత్రం 19.5 కోట్లు వసూలు చేయగా రెండో రోజు 10.02 కోట్ల షేర్ ని అందుకుంది. దీంతో ఈ రెండు రోజుల్లోనే కల్కి చిత్రం సుమారుగా 30 కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేసేసింది. ఇది ఖచ్చితంగా ఓ రికార్డే. సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా వైజయంతి మూవీస్ నిర్మించింది.

Also Read;మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌ కన్నుమూత..

- Advertisement -